భార్యను అదేపనిగా 59 సార్లు చేశాడు

368

భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన భర్తకు లండన్ కోర్టు జీవితఖైదును విధించింది. గతేడాది క్రిస్ట్‌మస్ రోజున జరిగిన ఈ ఘోరానికి కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. భర్త ప్రవర్తన నచ్చక విడిపోవాలని భావించిన భార్య తెల్లవారేసరికి విగతజీగా పడివుంది. ఆమె శరీరంపై 59 కత్తిపోట్లు ఉన్నాయి. ఫారెన్సిక్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. కిచెన్‌లోని రెండు కత్తులతో లారెన్స్ తన భార్యను 59 సార్లు పొడిచి పొడిచి చంపాడు. చనిపోయే ముందు ఏంజెలా ఎంతో నొప్పిని, బాధను అనుభవించిందని సీనియర్ ఇన్వెస్టిగేటివ్ అధికారి ఒకరు తెలిపారు. 59 పోట్లు పొడిచాక కూడా ఏంజెలా మరణించలేదని.. బతకడానికి ఎంతో ప్రయత్నించిందని చెప్పారు.

Image result for wife and husband

పొడిచే క్రమంలో ఒక కత్తి ఇరిగిపోతే మరో కత్తిని తీసుకుని మళ్లీ పొడిచాడని పేర్కొన్నారు. అధికారులు చెబుతున్న దాన్ని వింటేనే లారెన్స్ ఎంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడో అర్థం చేసుకోవచ్చు. లారెన్స్ ఆమెను పొడిచిన అనంతరం నేరుగా పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్టు ఒప్పుకుని లొంగిపోయాడు. లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏంజెలా మరణవార్తను ఆమె తల్లిదండ్రులు భరత్, కమలా మిట్టల్‌‌కు చెప్పగా వారు ఒక్కసారిగా కుప్పకూలారు. పోలీసులు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె భర్త పోలీసులకు నేరుగా లొంగిపోయి అసలు విషయం వెల్లడించారు.

ఈ ఘటన బ్రిటన్‌లో సంభవించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, లండన్‌లో మిట్టల్ (41), లారెన్స్ బ్రాండ్ (47) అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, భర్త ప్రవర్తన నచ్చక బ్రాండ్ విడాకులు తీసుకోవాలని భావించింది. దీనిపై భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో ఒకరోజు జాయింట్ బ్యాంకు ఖాతా నుంచి మిట్టల్ 35000 ఫౌండ్ల నగదును డ్రాచేసుకుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోపంతో ఊగిపోయిన భర్త వంటింట్లో ఉన్న చాకు తీసుకొని తన భార్యను పొడిచాడు. పొడిచేటప్పుడు చాకు ఇరిగిపోవడంతో మరో చాకుతో పొడిచి చంపాడు.

Image result for wife and husband

ఆమె హత్యను చేసిన అనంతరం పోలీసులకు ఫోన్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆమె మృతదేహంపై 59 కత్తిపోట్లు ఉన్నట్టు శప పరీక్షలో తేలింది. కుమార్తె హత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టులో జరుగగా, లారెన్స్ బ్రాండ్‌ను జీవితఖైదు (16 సంవత్సరాలు) శిక్షను అమలు చేసింది. లారెన్స్ బ్రాండ్ ఐటి కంపెనీలో ఉద్యోగ చేస్తున్నాడు. మిట్టల్ భారత సంతతికి చెందిన మహిళగా గుర్తించారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఏంజెలా మరణం పట్ల ఆమె కుటుంబసభ్యులకు పోలీసు అధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ కూతురికి జరిగిన దానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. తాజాగా కోర్టు లారెన్స్‌కు జీవితఖైదు విధించడంతో ఏంజెలా తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. లారెన్స్ చంపిన విధానాన్ని ఇన్‌వెస్టిగేటివ్ అధికారులు జడ్జికి వివరించగా.. 59 కత్తిపోట్ల గురించి విన్న జడ్జి సైతం నిర్ఘాంతపోయారు. ’ఒక కత్తి ఇరిగిపోతే మరో కత్తి తీసుకొచ్చి పొడిచావంటే ఆ సమయంలో ఆమె ఎంత నరకాన్ని అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు’ అని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. భార్యను అతి కిరాతకంగా చంపిన ఈ భర్తకు ఏ శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..