అందమైన తన భార్యను రోడ్డు మీద అందరు కన్నార్పకుండా చూస్తున్నారని భార్యను ఏం చేశాడో తెలిస్తే షాక్..

291

అందమైన అమ్మాయి కనిపిస్తే అబ్బాయిలు తనని ఫాలో అవటం, ఎలాగోలా ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు సహజంగా. అందమైన అమ్మాయి భార్యగా రావాలని కలలు కంటూ ఉంటారు. ఊహించినట్టే అందమైన అమ్మాయి భార్యగా వస్తే వారి ఆనందానికి అవధులుండవు. ఆ అమ్మాయికి దాసోహం అనేస్తారు కూడా. కానీ అటువంటిది అందమైన భార్యని చూసి ఓర్వలేకపోయాడు ఒక భర్త. తీవ్ర అభద్రతా భావానికి గురయ్యాడు. ఆఖరికి ఆ భార్యని చంపేయాలనుకున్నాడు. ఆ ఆలోచన వదిలేసి ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల వలలో చిక్కుకున్నాడు.మరి అతను ఏం చేశాడో పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి 

బీహార్ అరరియాకి చెందిన సద్దాం హుస్సేన్ కి ఇద్దరు భార్యలు. రెండవ భార్య చాలా అందంగా ఉంటుంది. బయటకు వెళ్తే అందరు ఆమెనే కన్నార్పకుండా చూసేవారు. అందరూ తన భార్యని చూడటం హుస్సేన్ కి నచ్చేది కాదు. తన భార్యని చూసినందుకు వారిపై గొడవకు దిగేవాడు. ఇలానే ఒకసారి తన భార్యను చూసినందుకు ఒక వ్యక్తిపై తారాస్థాయిలో గొడవ పడ్డాడు సద్దాం. తన భార్య అందంగా ఉండటం వలనే అందరూ ఆమెను చూస్తున్నారని ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. అదే రోజు మార్కెట్ నుండి ఒక కత్తిని కొన్నాడు. ఆ రాత్రికే ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ తర్వాత తన భార్యని చంపెయ్యాలనే ఆలోచన వదులుకున్నాడు.కానీ మరొక ప్లాన్ వేశాడు. తన అందమైన భార్యతో సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు. తర్వాతి రోజు తన భార్యతో మీ తల్లిదండ్రులను కలవటానికి ఇవాళ సాయంత్రమే ఢిల్లీ వెళ్దాం అని చెప్పాడు. తన భర్త మోసపూరిత ఆలోచన గ్రహించలేని ఆ అందమైన భార్య పుట్టింటికి వెళ్తున్నామన్న సంతోషంలో ఆమె రెడీ ఐపోయింది. ఇద్దరు కలిసి ఆరోజు సాయంత్రం ట్రైన్ కే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Image result for girls

ఢిల్లీ వెళ్ళగానే సద్దాం బ్రోతల్ హౌసెస్ గురించి, బ్రోకర్లు గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. ఆ నేపథ్యంలో తాను ఒక బ్రోకర్ కి కాల్ చేశాడు. ఆ వ్యక్తి కమల మార్కెట్ పోలీస్ స్టేషన్ కి పని చేసే పోలీస్ ఇన్ఫార్మర్ సునీల్ కుమార్. ఆ అధికారి హుస్సేన్ తో అమ్మాయిలని కొనే వ్యక్తిలానే మాటలు కలిపాడు. తనని ఒక ప్లేస్ లో మిగిలిన విషయాలు మాట్లాడుకోవడానికి మీట్ అవ్వమని చెప్పాడు. అనుకున్న స్పాట్ కి ఇంఫార్మెర్ తో పాటు కొంతమంది పోలీసులు మఫ్టీలో వచ్చారు. చెప్పిన టైం కి హుస్సేన్ కూడా తన భార్యని తీసుకురాకుండా అక్కడికి చేరుకున్నాడు. కాసేపు బేరసారాలు జరిపాక తన భార్యని 12 లక్షలకి విలువ కట్టారు. అడ్వాన్సుగా 10 వేలు తీసుకుని వెళ్ళాడు హుస్సేన్. తర్వాత వారికి తన భార్యని అప్పగించడానికి వచ్చిన హుస్సేన్ ని స్పాట్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని హుస్సేన్ భార్య షాక్ కి గురయ్యింది. ప్రస్తుతం ఆమె కౌన్సిలింగ్ తీసుకుంటుంది.హుస్సేన్ ను అరెస్ట్ చేశారు.చూశారుగా ఈ భర్త ఎంతటి పని చేశాడో. మరి ఈ ఘటన గురించైనా అలాగే ఇలా అందమైన భార్య ఉన్న భర్తలు అభద్రతా భావానికి గురయ్యి నేరాలకు పాల్పడటం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.