అల్లుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఐ 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసారు.. చివరికి?

516

స్త్రీ కి భర్తే దేవుడు అని మనకు తెలుసు.వాళ్ళు కూడా పతియే ప్రత్యక్ష దైవం అనుకుని జీవిస్తారు.ఎవరో తెలియని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం అతనితో కలిసి బతకడానికి వస్తుంది.అలాంటి మహిళను ఎలా చూసుకోవాలి చెప్పండి.కానీ ఎంతమంది చూసుకుంటున్నారు.ఒక ఆటబొమ్మగా చూసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.కట్నం తక్కువ ఇచ్చాడని ఒకడు పెళ్ళైన తర్వాత మోజు తీరాకా ఆమె అందం మీద వ్యామోహం తగ్గి ఆమెను చిత్రవాదాలకు గురి చేసేవాళ్ళు కొందరు అనుమానంతో హింసించే వాళ్ళు కొందరు.ప్రతి రంగంలో ఆడపిల్ల అభివృద్ధి చెందుతున్నా ఈ గృహహింసల భారీ నుంచి మాత్రం ఇప్పటికి తప్పించుకోలేకపోతున్నారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి మరో మహిళకు వచ్చింది.మరి ఆమెకు వచ్చిన ఆ కష్టం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls depression

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణి, కర్నూలు జిల్లాకు చెందిన మాచాని రాజేంద్రప్రసాద్‌కు గత ఏడాది ఆగస్టులో వివాహమైంది. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో రూ.55లక్షల కట్నం ఇచ్చి త్రివేణి తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లయి 24గంటలు గడవక ముందే శాడిస్ట్ మొగుడు వేధించడం మొదలుపెట్టాడు.ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వైరల్ చేసి పరువు తీస్తానని ఆమెను వేధించాడు. కొన్నాళ్లు టార్చర్ భరించిన బాధితురాలు విషయం అత్త చెవిలో వేసింది. అయితే.. కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సిన అత్త కోడలినే వదిలించుకోవాలనుకుంది.దాంతో చివరికి తన తల్లిదండ్రులకు చెప్పింది త్రివేణి.కూతురు పడుతున్న నరకయాతన గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇదేంటని అత్తింటి వారిని నిలదీశారు.

Image result for girls depression

అయితే అప్పటికే అన్నింటికీ సిద్ధపడ్డ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు త్రివేణికి టీబీ ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసి.. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని కొత్త నాటకానికి తెరలేపారు. అయితే త్రివేణిపై పడ్డ నిందను చెరిపేందుకు కర్నూలు అపోలోకి ఆమెను తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి టీబీ లేదని రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చారు. అయితే అప్పటికే తమ కొడుకుకు రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్ తల్లిదండ్రులు త్రివేణి తండ్రి మాటను లెక్కచేయలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.జరిగిన విషయాలన్నిటి మీడియాకు చెప్పి బాధితురాలు కన్నీరుమున్నీరయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

విన్నారుగా నపుంసకుడు అయ్యి ఉండి కూడా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనము చెయ్యడమే కాకుండా ఇప్పుడు మరొక పెళ్ళికి సిద్ధం ఎలా అయ్యాడో.మరి ఇలాంటి రాక్షసులను ఏం చెయ్యాలో మీరే చెప్పండి.నపుంసకుడు అయ్యుండి పెళ్లి చేసుకుని త్రివేణి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్ర ప్రసాద్ గురించి అలాగే తమలో లోపాలు పెట్టుకుని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ జీవితాలను నాశనము చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.