రీల్ కాదు.. రియల్ స్టోరీ : భార్య కన్యాదానం చేసిన భర్త

203

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘కన్యాదానం’ సినిమా చాలామందికి తెలుసే ఉంటుంది. అందులో ఉపేంద్ర, రచన ప్రేమించుకుంటారు. అయితే అనుకోకుండా రచనకు, హీరో శ్రీకాంత్‌కు పెళ్లి జరుగుతుంది. అయితే భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్… శ్రీమతిని, స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇలాంటి సన్నివేశాలు కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకుంటాం…కానీ రీల్‌లో కాదు… ‘రియల్‌‌’గానే భార్యను కన్యాదానం చేశాడో భర్త. దేశవ్యాప్తంగా సంచలనం క్రియట్ చేసిన సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ రియల్ కన్యాదాన స్టోరీ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian marriages

యూపీ వారణాసి పరిధిలోని గర్ఖడా గ్రామానికి చెందిన రాజ్బర్‌కు 2018 మే 21న ఘాజీపూర్‌కు చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆరా తీయగా అతనికి ఒక విషయం తెలిసింది. వాళ్లు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు ఒప్పుకోని కుటుంబసభ్యులు ఇతనితో పెళ్లి చేశారు. అయినా ప్రియుణ్ని మర్చిపోలేకపోయింది. భర్తకు తెలియకుండా రహస్యంగా అతన్ని కలుసుకోవడం మొదలుపెట్టింది. పెళ్లైన తర్వాత కూడా అతన్ని మర్చిపోలేకపోతోందని తెలిసింది. ఆమె తరుచూ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా అతనితో కలిసి తిరుగుతోందని తెలుసుకుని షాక్ తిన్నాడు. భార్య ప్రేమాయణం గురించి తెలుసుకున్న రాజ్బర్ భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రియున్ని దూరం పెట్టాలని కోరాడు. అయితే భర్త మాట పెడచెవిన పెట్టిన ఆమె ప్రేమ వ్యవహారం కొనసాగించింది.

ఈ క్రింది వీడియో చూడండి

భర్త హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయని యువతి శనివారం రాత్రి రాజ్బర్ ఇంట్లోలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. విషయం తెలుసుకున్న రాజ్బర్ వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్య ఆమె ప్రియుణ్ని బంధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను కూర్చోబెట్టి విషయం చెప్పాడు. తాను తీసుకున్న కఠిన నిర్ణయం గురించి వారికి వివరించాడు. ఎంత చెప్పినా తన మాట వినకుండా, ప్రియున్ని మర్చిలేకపోతున్న భార్యను అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. తొలుత కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత అంగీకరించారు. దీంతో భర్తే స్వయంగా కన్యాదాతగా మారి ప్రియుడితో భార్య పెళ్లి చేసి పంపాడు. ఈ ‘కన్యాదానం’ ప్రక్రియ సోషల్ మీడియాలో ఎక్కడంతో తెగ వైరల్ అయ్యింది. మరి భార్య ప్రేమ వ్యవహారం తెలిసిన ఈ భర్త చేసిన ఈ కన్యాదానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.