చెల్లి అంటూ వరుస కలిపింది, భర్తతో కలిసి ప్లాన్ చేసింది చివరకి ఇద్దరు కలిసి ఏం చేసారో తెలిస్తే

459

మీ పక్కింటి వాళ్ళతో కాస్త క్లోజ్ గా ఉంటున్నారా.. ఎక్కడి నుంచో వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారని వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటున్నారా.. వాళ్ళను మీ ఇంట్లో మనుషులుగా అనుకుంటున్నారా.. అయితే కాస్త జాగ్రత్త..ముఖ్యంగా అమ్మాయిలు మీరు జాగ్రత్త. అక్క అని పక్కింట్లో ఉన్న వాళ్ళను పిలిచి వాళ్లతో క్లోజ్ గా ఉంటె తర్వాత బాధపడేది మీరే. ఎందుకు ఏమైంది అని అనుకుంటున్నారా.ఇప్పుడు నేను చెప్పే ఘటన గురించి విన్నాకా మీకే అర్థం అవుతుంది. పూర్తీగా వినండి.

Image result for wife and husband

విశాఖపట్నంలోని గాజువాక సమీప ప్రాంతంలోని గాంధీనగర్ అది. రమేష్, రజితలు ఇద్దరు భార్యాభర్తలు. రమేష్‌ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి పిల్లలు లేరు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం ఎక్కువే. రమేష్‌ సంపాదించే జీతం సరిపోకపోవడంతో ఇబ్బందులు పడేవారు భార్యాభర్తలు.రమేష్, రజితలు నివాసముంటున్న ఇంటి పక్కనే మల్లీశ్వరి అనే యువతి ఉండేది. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు లక్ష రూపాయలకు పైగానే జీతం. ఇంటి పక్కనే కావడంతో రజిత, మల్లీశ్వరిలు ఫ్రెండ్సయ్యారు. మల్లీశ్వరి కుటుంబ నేపథ్యం మొత్తం రజితకు తెలుసు. రజిత ఆ విషయాలన్నింటిని భర్త రమేష్‌తో షేర్ చేసుకునేది.అయితే ఒకరోజు భార్యాభర్తలిద్దరికీ ఒక ఐడియా వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మల్లీశ్వరిని బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రమేష్, రంజితకు ఒక ఐడియా చెప్పాడు. నీ పుట్టినరోజు అని చెప్పి మల్లీశ్వరిని ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇస్తే ఆమె అపస్మారకంలోకి వెళ్లాక ఆమెపై అత్యాచారం చేస్తాను. ఆ తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమె జీతంలో సగం డబ్బులు ప్రతినెలా తీసుకుందామని చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిన రజిత తన భర్త ఐడియాకు ఓకే చెప్పింది. రజితతో కలిసి ఉన్నంతవరకు మల్లీశ్వరిని చెల్లి అని పిలిచిన రమేష్ పశువుగా మారిపోయాడు. అనుకున్నట్లుగా మల్లీశ్వరికి మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత స్పృహలోకి వచ్చిన మల్లీశ్వరిని భార్యాభర్తలిద్దరూ కలిసి బెదిరించారు. దీంతో మల్లీశ్వరి రెండురోజుల పాటు నిద్రాహారాలు మాని ఆలోచనలో పడింది. తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి షీ టీంకు చెప్పింది మల్లీశ్వరి. షీం టీం పోలీసులు రంగంలోకి దిగి భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.చూశారుగా ఈ భార్యాభర్తలు ఎంతటి పనిచేశారో. ఇలాంటివాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్త. లేకుంటే తర్వాత నాశనం అయ్యేది మీద జీవితమే. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఈ భార్యాభర్తలు చేసిన నిర్వాకం గురించి అలాగే ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.