ఈ అమ్మాయి లావుగా ఉందని ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు.. దాంతో ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్.

470

అబ్బాయిలు సన్నగా నాజూకుగా ఉండే అమ్మాయిల పట్ల ఆకర్షితులు అవుతారు.అలా ఉండే అమ్మాయే భార్యగా రావాలని అనుకుంటారు.అమ్మాయి కాస్త లావుగా ఉందని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.సన్నగా ఉన్న అమ్మాయి వస్తే జీవితం సుఖంగా ఉంటుందని లావుగా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోరు. ఇలాంటి పరిస్థితే ఒక అమ్మాయి ఎదుర్కొంటుంది. లావుగా ఉన్న తనను ఎవరు పెళ్లి చేసుకోవడం లేదని ఆ యువతీ చావుకు సిద్దపడింది. మరి ఆ విషాదకర ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి అనిత (27) అనే యువతి డిగ్రీ పూర్తి చేసింది. చదువులో బాగానే రాణించింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఎన్నో సంబంధాలు చూసినా అవి కుదరలేదు.వచ్చిన వాళ్ళందరూ ఆమెను చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. చాలా రోజుల నుంచి ఇదే తంతు నడుస్తుంది. పెళ్లి చూపులకు అని వస్తారు. పిల్ల నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఇలా ఇన్ని సంబంధాలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి లావుగా ఉండటమే. అమ్మాయి చూడటానికి అందంగా ఉన్నా కానీ ఆమె లావుగా ఉండటం వలనే అమ్మాయి ఎవరికీ నచ్చడం లేదు. అనిత కొద్దిగా లావుగా ఉండటంతో ఆమెను చేసుకునేందుకు యువకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇలా పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయికి పెళ్లి అవుతుందా లేదా అని దిగులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఒకనొక సమయంలో కన్నీళ్లు కాల్చడం జరిగింది. అది చుసిన అనిత తట్టుకోలేకపోయింది.నేను ఎవరికీ నచ్చడం లేదు. నాకు ఇక పెళ్లి కాదు. నన్ను ఎవరు చేసుకోరు. నాకోసమని అమ్మానాన్న బాధపడుతున్నారని తనలో తాను ఆలోచించి ఆలోచించి తీవ్ర మనస్తాపం చెందింది.ఇక బతకడం అనవసరం అనుకుని పురుగుల మందు సేవించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది.అనితను బతికించడానికి డాక్టర్స్ చాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యం అవ్వడంతో అనితను బ్రతికించడం సాధ్యం కాలేకపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.చూశారుగా ఈ యువతీ ఎంతటి పని చేసిందో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా వివిధ కారణాల వలన పెళ్లి జరగడం లేదని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న యువతీ యువకుల ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.