55 మందిని బలి తీసుకున్న కొండ గట్టు బస్సు ప్రమాదం ఇలా జరిగింది

444

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఏకంగా 57 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 36 మంది మహిళలు కాగా ఐదుగురు చిన్నారులు ఉన్నారు. బస్సులో ఏకంగా 104 మంది ఉండగా.. ఐదారుగురు మినహా మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ మరణించగా, కండక్టరుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లోనూ క్షతగాత్రుల్లో కూడా ఎక్కువమంది మహిళలే. దాంతో, కొండగట్టు శోక సంద్రమైంది. ఆ ప్రాంతమంతా హాహాకారాలు మిన్నంటాయి. బస్సు పడిన ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

Image result for bus accident in telangana

అయితే ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది.ప్రమాదం జరిగే ముందు ఏం జరిగింది.ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందాం.కొండగట్టు ప్రమాదంతో ఐదు గ్రామాల్లో విషాదం అలముకుంది. కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, డబ్బుతిమ్మయ్యపల్లిల్లోని దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులు బస్సులో ఎక్కారు. మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా ఆ ఐదు గ్రామాలవారే. దీంతో, ఆ గ్రామాల్లో విషాదం అలముకుంది.అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగే ముందు ఏం జరిగిందంటే.. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సులో చాలా మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు.దేవుడి దర్శనం అయిపోయింది ఇక ఇంటికి వెళ్లాలని అందరు ఒకే బస్సు ఎక్కారు.బస్సు లు ఎక్కువ లేకపోవడం వలన ఎక్కువ మంది ఒకే బస్సు ను ఎక్కారు.

Image result for bus accident in telangana

కొందరు బస్సు లో చోటు కోసం చూసుకుంటున్నారు! ఇంకొందరు నిలుచోవడానికి కూడా చోటు లేక ఆపసోపాలు పడుతున్నారు! కిక్కిరిసిన బస్సులో పట్టుకునేందుకు ఆధారం కూడా లేకుండా మరికొందరు నలిగిపోతున్నారు! అంతలోనే.. వేగంగా వెళుతున్న బస్సుకు ఒక్క భారీ కుదుపు! కారును తప్పించడానికి అతి వేగంగా వెళుతున్న బస్సు స్టీరింగ్‌ను ఒక్కసారిగా కుడి వైపునకు తిప్పడం స్పీడ్‌ బ్రేకర్‌ను దాటి బస్సు ఒక్కసారిగా ఎగరడం ఒకేసారి జరిగిందిబస్సును నియంత్రించడానికి డ్రైవర్‌ ప్రయత్నించాడు. బ్రేకులు తొక్కాడు.కానీ అప్పటికే సమయం మించిపోయింది. న్యూట్రల్‌లో ఉన్న బస్సు కొండ దిగువకు అతి వేగంతో దూసుకుపోయింది. వరుస కుదుపులకు ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరిగిపోయారు. డ్రైవర్‌ సీటు, ఇంజన్‌ పక్కన నిలుచున్న ప్రయాణికులు పట్టు తప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

డ్రైవర్‌పై పడిపోయారు. దాంతో, బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయారు. బస్సు అలా ముందుకు దూసుకుపోయింది. రోడ్డుకు కుడివైపున ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. మరో 15 మీటర్లు దూసుకెళ్లి 25 అడుగుల లోయలో పడిపోయింది. అంతే.. కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది..ప్రమాదానికి జరగడానికి ముందు జరిగిన విషయం ఇదే.ఒకవేళ ఎక్కువమంది బస్సు ఎక్కకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కొండగట్టు ప్రమాదం గురించి అలాగే ఆ ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.