కండోమ్‌లను వీళ్ళు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారో చూస్తే మెంటల్ ఎక్కుతుంది..

258

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు.లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే కండోమ్ ను కేవలం శృంగారానికి కాకుండా ఇంకా అనేక విధాలుగా ఉపయోగించవచ్చని అంటున్నారు ఒక దేశం వాళ్ళు.మరి వారు కండోమ్ ను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారా చూద్దామా.

Image result for condom

కండోమ్‌లను ఎందుకు ఉపయోగిస్తారు..? అరక్షిత శృంగారం కారణంగా హెచ్ఐవీ, ఇతర సుఖ రోగాల బారిన పడకుండా ఉండేందుకు కదూ. కానీ క్యూబాలో మాత్రం కండోమ్‌లను శృంగారం కోసం కంటే ఇతర అవసరాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. వైన్‌ను పులియబెట్టడానికి, జుట్టుకు రబ్బర్ బ్యాండ్‌లుగా, టైర్లు పంక్చర్లు వేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి బెలూన్లుగా.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్ని రకాలుగా వాడొచ్చో.. అన్ని రకాలుగా వాడేస్తున్నారు. వారి వాడకం చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది.ఇంతకూ క్యూబన్లు ఇలా కండోమ్‌లను వాడేయడానికి కారణం అమెరికానే. రష్యాకు మిత్రదేశమైన క్యూబాపై అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు విధించింది. దీంతో ఆ దేశానికి అవసరమైన వస్తువుల దిగుమతులు నిలిచిపోయాయి.హెయిర్ బ్యాండ్లు, బెలూన్లు.. ఇలా ఏ వస్తువు ధర తీసుకున్నా.. భారీగా పెరిగిపోయాయి. సంపాదనేమో అంతంత మాత్రం, వస్తువుల ధరలేమో చుక్కలను తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కండోమ్‌లు ఆశాకిరణంగా కనిపించాయి.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కండోమ్‌లపై సబ్సిడీ ఇస్తుండటం.. స్వదేశంలో ఉత్పత్తి కావడంతోపాటు.. ఆసియా దేశాల నుంచి దిగుమలతో మిగతా వస్తువుల కంటే అక్కడ కండోమ్‌లు చౌకగా లభ్యం అవుతున్నాయి.దీంతో క్యూబా ప్రజలు కండోమ్‌లను బెడ్రూం అవసరాల కంటే ఇతర అవసరాల కోసం వాడటం ఎక్కువైంది.అక్రమ వలసల భయంతో తీర ప్రాంత జలాల్లో చేపల వేటకు వెళ్లడంపై నిషేధం ఉంది. దీంతో పడవలను ఉపయోగిస్తే దొరికిపోతామనే భయంతో.. వెదురు కర్రలను కండోమ్‌లతో కలిపి కట్టి వాటిపై చేపల వేటకు వెళ్తున్నారు. ద్రాక్ష రసాన్ని పులియబెట్టే బాటిళ్లకు మూతలుగానూ కండోమ్‌లను ఉపయోగిస్తుండటం విశేషం. కండోమ్‌ల సాగే గుణం వల్ల గ్యాస్ బయటకు పోకుండా వైన్‌లో ఆల్కహాల్ శాతం పెరుగుతుందని వైన్ తయారీదారులు దీనిని ఉపయోగిస్తున్నారు.చూశారుగా కండోమ్ ను ఈ దేశం వాళ్ళు ఎలాంటి ఎలాంటి పనులకు ఉపయోగిస్తున్నారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కండోమ్ గురించి దాని ఉపయోగం గురించి అలాగే క్యూబా వాళ్ళు కండోమ్ ను వినియోగిస్తున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.