ఏ వ‌య‌సులో ఎన్నిసార్లు శృంగారం చేయాలో తెలుసా.?

442

మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే.అయితే శృంగారం విషయంలో మనం ఒక విషయాన్నీ ఖచ్చితంగా పాటించాలి.అదేమిటి అంటే మన వయసును బట్టి మనం ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసుకోవాలి.మరి ఏ వయసులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసుకుందామా.

శ‌రీరానికి శృంగారం అనేది ఒక దివ్య ఔష‌దం. మ‌నం జీవించ‌డానికి కూడు, గూడు, గుడ్డ ఎంత అవ‌స‌ర‌మో అల‌సిన మ‌న‌సును సేద‌తీర్చేందుకు శృంగారం కూడా అంతే అవ‌స‌రం. అయితే నేటి యాంత్రిక జీవ‌న విధానంలో శృంగారం పై ఆస‌క్తిలోపిస్తున్న‌ట్లు, ఉరుకుల ప‌రుగుల జీవితంతో సాయంత్రానికి అల‌సిపోయి మ‌న‌సు గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. దీంతో దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు ఏర్ప‌డి విడిపోతున్నార‌ని ఇటీవ‌ల ఓ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో తేట‌తెల్ల‌మైంది.ఒత్తిడిని తగ్గించి, రిలాక్సేషన్, చర్మసౌందర్యాన్ని మెరుగుపర‌చ‌డంలో శృంగారం ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంద‌ని స్కాటిష్ హాస్పిటల్ స‌ర్వేలో తేలింది. అయితే ఈ స‌ర్వేలో వ‌య‌సుని బ‌ట్టి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది.

రోజు శృంగారం చేయ‌డం వ‌ల్ల మ‌నుషులు ఆరోగ్యంగా ఉంటూ అనేక వ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యే ఒత్తిడిని సునాయాసంగా అడ్డుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. 18 నుంచి 29 వయసు వాళ్లు ఏడాదికి కనీసం 112సార్లు శృంగారంలో పాల్గొన్నాలి.అంటే నెలకు కనీసం 10సార్లైనా శృంగార మాదుర్యాన్ని ఎంజాయ్ చేయాలంట‌.30 నుంచి 39 ఏళ్ల వాళ్లు.. ఏడాదికి కనీసం 86సార్లు శృంగారంలో పాల్గొనాలి. అంటే నెలకు కనీసం 7 నుంచి 8 సార్లు శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి.40 నుంచి 49 ఏళ్ల వాళ్లు యావరేజ్ గా ఏడాదికి 69సార్లు శృంగారంలో పాల్గొనాలి.పర్ఫెక్ట్ నెలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటే తక్కువ అని, వారానికి ఒకసారి పర్వాలేదని, వారానికి 3 నుంచి 5 సార్లు శృంగారంలో పాల్గొంటే పర్ఫెక్ట్ అని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి.విన్నారుగా ఏ వయసులో ఉన్నవాళ్లు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో.