యవ్వనం లో శృంగారం చేసి గర్బం వస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..

494

కొంతమంది చిన్న వయసులో పెళ్లి చేసుకుని తొందరగా గర్భం దాల్చుతారు.దీనిని యుక్త వయసు గర్భం అంటారు.యుక్త వయసు గర్భం అంటే 20 ఇయర్స్ కన్నా తక్కువ వయసులో గర్భం రావడం.ఈ వయసులో ఉన్న వారు చట్ట పరంగా మైనర్ గా గుర్తిస్తారు.మొదటసారి గర్బాన్ని ధరించే స్త్రీలలో 67 శాతం మంది 18 నుంచి 20 ఏళ్ళు ఉన్న అమ్మాయిలే ఉన్నారు.అయితే ఇలా యుక్త వయసులో గర్భం దాల్చితే కొన్నో సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు.మరి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందామా..

Image result for pregnancy

యుక్త వయసులో గర్భం దాల్చడం వలన ఆ తర్వాత తరం వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.వుమెన్ హెల్ప్స్ చానెల్ వాళ్ళు తెలిపిన దాని ప్రకారం అమెరికాలో చాలా మంది యుక్త వయసులో గర్బాన్ని దాల్చుతున్నారు.యుక్త వయసులో వచ్చే గర్భాలలో 80 శాతం నియంత్రించలేనివి.20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి గర్భంలో చాలా సమస్యలు తలెత్తుతాయి.17 ఏళ్ల కంటే తక్కువ వయసులో గర్భం దాల్చితే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది.ఇప్పటికి చాలా మంది చనిపోయారు కూడా.అయితే యుక్త వయసులో గర్భం వస్తే అమ్మాయిలు సరైన జాగ్రత్తలు తీసుకోరు.

Image result for pregnancy

ఏమి కాదులే అనే దీమలో ఉంటారు.ప్రతి 10 మందిలో 7 గురు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు.ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం పొగ త్రాగడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇలా చేసే వాళ్ళు గర్భం సమయంలో అధిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.స్థనాలలో గాయాలు అలసట ఎక్కువగా రావడం చిరాకు అధిక రక్త పీడనం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.యుక్త వయసులో పుట్టిన వారి బిడ్డలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.ముఖ్యంగా జ్ఞాపక శక్తి లోపాలు,అవయవ లోపాలు,పెరుగుదల లోపాలు,పోషకాల లోపాలు వంటి సమస్యలతో జన్మిస్తునారు.యుక్త వయసులో గర్భం దాల్చిన గర్భ సమయంలో గర్భ శరీరంలో ఉండాల్సిన శరీర బరువు కన్నా తక్కువ లేదా ఎక్కువగా ఉంటున్నారు.దీని వలన పుట్టబోయే బిడ్డలు తక్కువ బరువు లేదా ఎక్కువ బరువు లేదా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొంతమందికి అయితే శరీరం బాగాలు డెవలప్ కానీ పిల్లలు జన్మిస్తున్నారు.ఇందులో ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు,గుండె సంబంధిత సమస్యలు,ప్రేగు సంబంధిత సమస్యలతో మెదడుకు సంబంధించిన సమస్యలతో పుడుతున్నారు.అలాగే ఎవరైతే మొదటి త్రైమాసికలో తగిన జాగ్రత్తలు తీసుకోరో వారికి పుట్టిన పిల్లలు చనిపోతున్నారు.కాబట్టి యుక్త వయసులో గర్భం దాల్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాకర్స్ సూచిస్తున్నారు.మరి ఈ విషయం మీద మీరేమంటారు.యుక్త వయసులో గర్భం దాల్చితే వచ్చే సమస్యల మీద అలాగే వారికి పుట్టబోయే పిల్లలకు వచ్చే సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.