వయాగ్రా.. ఎలా పనిచేస్తుంది? దాని ప్రభావం ఎంతసేపు ఉంటుంది?

383

వయాగ్రా అనగానే లైంగిక శక్తిని పెంచే ఓ పిల్ అనే విషయం ఎవరికైనా అర్థమయిపోతుంది. అంగస్తంభన సమస్యతో బాధపడేవారు వయాగ్రాకు అలవాటు పడతారు. అయితే, ఈ వయాగ్రా ఎలా పనిచేస్తుందనే విషయంపై మాత్రం అవగాహన చాలా తక్కువ. ఇది స్కలనాన్ని అదుపులో ఉంచి అంగాన్ని ఎక్కువ సేపు గట్టిగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అయితే, అది ఎంతసేపు పనిచేస్తుంది ఎలా పని చేస్తుందో మీకు తెలుసా. తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి వయాగ్రా ఎలా పనిచేస్తుందో దాని ప్రభావం ఎంతసేపు ఉంటుందో చూద్దామా.

Image result for lovers

వయాగ్రా పనితీరు ప్రతి నిమిషానికి మారుతుంది. సాధారణంగా 40 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉండేవారికి స్కలన సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వ్యక్తులు వయాగ్రా ద్వారా తమ లైంగిక జీవితాన్ని కొనసాగిస్తారు. దీనిపై పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా ఓ వయాగ్రా డ్రగ్‌పై పరిశోధనలు జరిపారు. ఇది నిమిషాలతో మొదలుకుని కొన్ని గంటల వరకు పనిచేస్తుంది. శీఘ్ర స్కలనంతో బాధపడేవారు వయాగ్రా తీసుకున్నట్లయితే 12 నిమిషాల వరకు అంగం స్తంభిస్తుంది. 12 నిమిషాల్లో స్కలనం కానట్లయితే అది మరో అరగంట వరకు పనిచేస్తుంది. పరిశోధకుల అంచనా ప్రకారం వయాగ్రా పనిచేసే సరాసరి సమయం 27 నిమిషాలు. వయాగ్రా 57 నిమిషాల వరకు పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వయాగ్రా వేసుకున్న గంటలో అది రక్తంలో కేంద్రీకృతం అవుతుంది. అందుకే వైద్యులు సెక్సుకు ఒక గంట ముందు వయాగ్రాను తీసుకోవాలని సూచిస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి

వయాగ్రా వేసుకున్న తర్వాత ఒకసారి స్కలనమైనా, మళ్లీ ఇంకోసారి సెక్స్ చేయొచ్చు. అయితే, 4 గంటల తర్వాత అది క్రమేనా ప్రభావం తగ్గుతుంది. అంటే దాని పవర్ సగానికి తగ్గిపోతుంది. చిత్రం ఏమిటంటే.. 10 గంటల తర్వాత కూడా కొంతమందికి అంగస్తంభన కలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ సమయంలో కూడా కొంతమందికి అంగం స్తంభించే అవకాశం ఉంది. సుమారు 16 నిమిషాలు సెక్స్ చేయగలరు. ఆ తర్వాత క్రమేనా పవర్ తగ్గిపోతుంది. రక్తంలో కలిసే వయాగ్రా సుమారు 24 గంటల తర్వాత పూర్తిగా తొలగిపోతుంది. రోజులో ఒకసారి వయాగ్ర వేసుకున్నవారు.. 24 గంటల వరకు మళ్లీ వాడకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదం.కాబట్టి వయాగ్రా వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి వయాగ్రా గురించి అది పనిచేసే విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.