బిడ్డ పుట్టిన తరువాత అమృత ఆర్యోగం ఎలా ఉంది ? ఎవరిని అనుమతించని డాక్టర్స్

384

ప్ర‌ణయ్ అమృత చూడ‌చ‌క్క‌ని జంట కాని మారుతిరావు వేసిన క‌త్తివేటు ఆ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రిని కంట‌త‌డిపెట్టించింది, ప్రేమికులు అంద‌రూ కూడా ఇలాంటి బాధ ఎవ‌రికి రాకూడ‌దు అని క‌న్నీరు పెట్టుకున్నారు, అయితే మారుతిరావు కుమార్తెగా అమృత ఇక వారి ఇంట‌కి వెళ్ల‌ను అని ప్ర‌ణ‌య్ కుటుంబంతోనే ఉంటోంది త‌న‌కు పుట్ట‌బోయే బిడ్డ‌లో ప్ర‌ణ‌య్ ని చూసుకుంటాను అని చెప్పింది అమృత‌.మారుతిరావు ప‌గ‌కు అమృత భ‌ర్త ప్ర‌ణ‌య్ ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్ లో ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో ప్ర‌ణ‌య్ భార్య అమృత పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం అమృత మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

Image result for pranay amrutha baby

తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వివాహం చేసుకొని బుధవారానికి సరిగ్గా ఏడాది అవుతోంది. అదే రోజున పండంటి బిడ్డ జన్మించడంతో ప్రణయ్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక ప్ర‌ణ‌య్ హ‌త్య త‌ర్వాత అమృత కూడా పోలీసుల‌ను ర‌క్ష‌ణ కోరింది.. త‌న బిడ్డ‌కు ఏమైనా ఆప‌ద వ‌చ్చే అవ‌కాశం ఉంది అని కోరింది.. కొన్ని రోజులు ర‌క్ష‌ణ కూడా క‌ల్పించారు పోలీసులు.. ఇక డెలివ‌రీ స‌మ‌యంలో ఆమెని హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. హైద‌రాబాద్ లో ఆమెని ఆస్ప‌త్రిలో చేర్పించుకునే స‌మ‌యంలో ముందుగానే ఆస్ప‌త్రి కండిష‌న్ పెట్టింది అని తెలుస్తోంది. ఆమెని చూడ‌టానికి బ‌య‌ట నుంచి రాజకీయ నాయ‌కులు అలాగే మీడియా ఎవ‌రూ కూడా రాకూడ‌దు అని చెప్పార‌ట, ఇలా ఎవ‌రైనా వ‌స్తే వెంట‌నే డిశ్చార్జ్ చేస్తామ‌ని చెప్పార‌ట వైద్యులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఆస్ప‌త్రిలోకి ఎవ‌రిని అనుమ‌తించ‌డం లేదు, అంతేకాదు, అస‌లు ఈ ఆస్ప‌త్రిలో అమృత లేదు అని అక్క‌డ సెక్యూరిటీ కూడా స‌మాధానం ఇస్తున్నారు.. దీంతో మీడియా వారు కూడా ఆస్ప‌త్రి సిబ్బందిని ప్ర‌శ్నించాలి అని చూశారు ,కాని వారు ఎవ‌రూ అందుబాటులో లేరు మ‌రి, మీడియాలకు రాజ‌కీయ నేత‌ల‌కు ఎలా ఉన్నా మ‌హిళ‌లు అయిన త‌మ‌కు కూడా అవ‌కాశం లేకుండా ఆస్ప‌త్రి వ‌ర్గాలు చేయ‌డం ప‌ట్ల మ‌హిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముందు నుంచి ఆమెకు అండ‌గా తాము ఉన్నాము అని ఇలా మమ్మ‌ల్ని ఆప‌డం దారుణం అని విమ‌ర్శిస్తున్నారు.. మ‌రి చూశారుగా ఆస్ప‌త్రి మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్ట్ అని భావిస్తున్నారా, మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.