రాకెట్ లేదా స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుండి తిరిగి భూమి పైకి ఎలా వస్తుంది

130

రాకెట్ నుంచి మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం అంతరిక్షంలోకి శాటిలైట్స్ ను పంపిచాలన్నా లేదా ఆస్తోనాడ్స్ ను పంపించాలన్నా ఈ రాకెట్స్ నే వాడతారు. అయితే మీకు తెలుసా..ఈ రాకెట్ అసలు అంతరిక్షంలోకిఎలా వెళ్తుంది. అలాగే అంతరిక్షంలోకి రీసెర్చ్ కోసం వెళ్లిన ఆస్తోనాడ్స్ తిరిగి భూమి పైకి ఎలా చేరుకుంటారు. తెలీదు కదా..ఈ వీడియోలో వాటన్నిటి గురించి తెలుసుకుందాం.

Image result for స్పేస్ క్రాఫ్ట్

అంతరిక్షం లోకి పంపే రాకెట్ ను స్పేస్ క్రాఫ్ట్ అని అంటారు. వాస్తవానికి రాకెట్ భూమి మీదకు వస్తుంది అని అనడం తప్పు. రాకెట్ అనేది న్యూటన్స్ 3 లాకు అనుగుణంగా పనిచేస్తూ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా ఉపయోగించే ఒక యంత్రం. అంతరిక్ష యాత్రికులు కూర్చొని పైకి వెళ్లే వాహనాన్ని స్పేస్ క్రాఫ్ట్ అని అంటారు. ఈ రాకెట్స్ ను అంతరిక్షంలోకి రెండు విధాలుగా పంపిస్తారు. అవేంటి అంటే…

Image result for స్పేస్ క్రాఫ్ట్
  1. ఈ పద్దతిలో అంతరిక్షంలోకి శాటిలైట్స్ లేదా రోబోట్స్ ను పంపిస్తారు. ఈ శాటిలైట్స్ లేదా రోబోట్స్ అక్కడే ఉండి పనిచేస్తాయి. వీటిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే అవసరం లేదు. అందుకే ఈ పద్దతిలో శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి కేవలం రాకెట్స్ ను మాత్రమే వాడతారు. ఈ రాకెట్ కు నాలుగువైపులా బూస్టర్ రాకెట్స్ అమర్చబడి ఉంటాయి. అవి రాకెట్ ఫోర్స్ గా పైకి ఎగరడానికి ఉపయోగపడతాయి. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కు బయటకు అంటే పైకి వెళ్ళాకా ఈ రాకెట్ చిన్నచిన్న ముక్కలుగా విడిపోతుంది. చివరికి శాటిలైట్ మాత్రమే మిగులుతుంది. అది అంతరిక్షంలో దాని ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ లో రాకెట్ అనేది అంతరిక్షంలో వివిధ భాగాలుగా విడిపోతుంది. ఇలాంటి రాకెట్ తిరిగి భూమి పైకి రాదు.
Related image
  1. ఇక రెండవ పద్దతిలో మనుషులు స్పేస్ క్రాఫ్ట్ లో కూర్చొని అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది విమానంలాగానే ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో మనుషులు తినడానికి పడుకోడానికి తాగడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ముందు అంతా కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. దానితో అంతరిక్ష యాత్రికులు స్పేస్ క్రాఫ్ట్ ను కంట్రోల్ చేస్తారు. ఈ స్పేస్ రాకెట్ కు రెండు బూస్టర్ రాకెట్స్ తో పాటు ఒక మెయిన్ ఇంజన్ రాకెట్ అటాచ్ అయ్యి ఉంటుంది. బూస్టర్ రాకెట్స్ అనేవి స్పేస్ క్రాఫ్ట్ పైకి ఎగరడానికి ఉపయోగపడతాయి. వాటిలో ఇంధనం అయిపోగానే అవి ఆటోమేటిక్ గా స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోతాయి. ఇక మిగిలింది మెయిన్ ఇంజన్ రాకెట్. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను స్పేస్ వరకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం ఈ ఇంజన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఈ ఇంజన్ కూడా స్పేస్ రాకెట్ నుంచి ఆటోమేటిక్ గా విడిపోతుంది. ఇక్కడి నుంచి ఈ స్పేస్ రాకెట్ జర్నీ మొదలవుతుంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇప్పడూ ఈ స్పేస్ రాకెట్ ను అంతరిక్ష యాత్రికులు విమానాన్ని పైలెట్ లు నడిపినట్టు నడుపుతారు. దీనిలో అడ్వాన్సుడు టెక్నాలజీ సెన్సార్లు, మిషిన్స్ ఉంటాయి. వీటి సహాయంతో అంతరిక్ష యాత్రికులు వారి రీసెర్చ్ ను పూర్తీ చేస్తారు. అంతరిక్షంలో కొన్ని రోజులు రీసెర్చ్ చేసి వారి పని పూర్తీ చూశాకా భూమి పైకి తిరిగొస్తారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి మీదకు ఎలా వస్తుందో తెలుసా..ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందు భూమి కక్ష్యలోకి వచ్చి మెల్లగా తిరుగుతూ తిరుగుతూ మెల్లగా భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. భూ వాతంవరణంలోకి ప్రవేశించిన తర్వాత భూమికి సమాంతరంగా ఉండకుండా కొంచెం పైకి లేచి ఉంటుంది. ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ భయంకరమైన గాలులను ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. అలా మెల్లమెల్లగా ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి దగ్గరగా వస్తున్నపుడు అది మెల్లగా భూమికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.

Related image

ఆ తర్వాత ఇది విమానం లాగానే ఎయిర్ పోర్ట్ ల్యాండ్ మీద ల్యాండ్ అవుతుంది. విమానంలాగే ల్యాండ్ అయ్యే సమయంలో దాని చక్రాలు ఓపెన్ అవుతాయి. అయితే స్పేస్ ల్యాండ్ అయ్యే సమయంలో దాని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అది రన్ వే మీద ల్యాండ్ అవ్వగానే వెనుక నుంచి ఒక ప్యారాచూట్ ఓపెన్ అవుతుంది. దీంతో దాని స్పీడ్ కంట్రోల్ అయ్యి అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా అంతరిక్ష యాత్రికులు సురక్షితంగా భూమి మీదకు చేరుతారు.ఈ స్పేస్ క్రాఫ్ట్ ను కావాలంటే మళ్ళి ఉపయోగించవచ్చు. రెండు బూస్టర్ రాకెట్స్ ను మెయిన్ ఇంజన్ ను అమర్చి మళ్ళి దీనిని స్పేస్ లోకి పంపిస్తారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి పైకి వెళ్లి అక్కడ తిరిగి మళ్ళి భూమిపైకి రావడానికి దీనిని ఇంత ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటది. దీనికి సమాధానం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అంతరిక్షంలో నిర్మించబడిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు సైంటిస్టులు రెగ్యులర్ గా ఫుడ్, వాటర్, ఇంధనం మరియు అవసరం ఐన మిషన్స్ ను పంపిస్తుంటారు. అక్కడి నుంచి ఈ అంతరిక్ష యాత్రికులు మళ్ళి వీటిని పొందుతారు.