ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలిస్తే ఆ ఉద్యోగం వ‌ద్దు అంటారు

578

అమెరికాలో సిలికాన్ వ్యాలీ అనేస‌రికి టాప్ కంపెనీలో ఉద్యోగం, ఇంక సంవ‌త్స‌రానికి ప్యాకేజీ కూడా కోట్ల‌రూపాయ‌ల‌లో ఉంటుంది అని ఆశ‌ల‌తో అడుగులు పెడ‌తారు.. ముఖ్యంగా గూగుల్, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, యాహూ, అమెజాన్, సిటి బ్యాంక్ ఇలా ప్ర‌ముఖ కంపెనీ ప్ర‌ధాన కార్యాల‌యాలు అన్నీ ఉన్న‌ప్రాంతం ఇది…. ఇక ఇక్క‌డ కంపెనీల‌లో ఉద్యోగం అనేస‌రికి వెంట‌నే ఎస్ చెబుతారు ఎవ‌రైనా .. అయితే టాప్ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం అన‌గానే ఎస్ చెప్పినా అక్క‌డ ఉద్యోగం చేయాలంటే స్కిల్స్ తో పాటు వారు మాన‌సికంగా కూడా ఎంతో ధృడంగా ఉండాలి. ముఖ్యంగా గూగుల్ కంపెనీ అనేది వ‌ర‌ల్డ్ లో బెస్ట్ ఎంప్లాయ్ మెంట్ ట్రీట్ అవార్డును గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా తీసుకుంది.. ఇక్క‌డ ఉద్యోగుల‌కు గూగుల్ క‌ల్పించే సేవ‌లు తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతాము.. ఏ కంపెనీ ఇవ్వ‌ని స‌దుపాయాలు ఉద్యోగుల‌కు గూగుల్ ఇస్తోంది. ఇక అమెజాన్ కూడా ఆ వ‌రుస‌లో వెళుతోంది. తాజాగా ఇప్పుడు సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ గురించి ఓ మాజీ ఉద్యోగి చెప్పిన విష‌యాలు వింటే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఆమె ఫేస్ బుక్ లో ఉద్యోగం చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెబుతోంది

Image result for facebook office

అందరూ ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేస్తారు. అక్కడ మంచి జీతం అలాగే ఉచితంగా భోజనం, ఇంకా అదిరే పని వాతావరణం అబ్బో అందరూ చాలానే ఊహించుకుంటారు. కాని లోపలికి వెళితే గాని కష్టాలు తెలియవు అంటోంది ఓ మాజీ ఫేస్‌బుక్ మహిళా ఉద్యోగి. మీరు అటువంటి ఆశలతో ఉద్యోగంలో చేరితే మీ బతుకు బస్టాండే అన్నంతగా ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మీరు ఊహించనదానికి అక్కడ చేసే ఉద్యోగానికి అసలు సంబంధం ఉండదని ఆ ఉద్యోగి ఆరోపిస్తున్నారు.ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అనగాగనే మంచి జీతం, ఉచిత భోజనం, ఎంతో గొప్ప పని వాతావరణం ఇలాంటి ఆశలు, ఊహలు అస్సలు వద్దని ఫేస్‌బుక్‌లో పని చేసిన మహిళా ఉద్యోగి చెబుతున్నారు….కోపం, నిరుత్సాహం ఎక్కువ‌గా ఉంటుంద‌ని , అలాగే ప‌క్క‌వారితో మాట్లాడడానికి విల్లేని విధంగా ఆఫీసు వాతావ‌రణంఉంటుందని ఫేస్‌బుక్ ట్రెండింగ్ టీమ్ లో కాంట్రాక్టర్ గా పనిచేసిన మహిళా ఉద్యోగి తెలిపారు.

Related image

న్యూస్ క్యూరేటర్‌గా పనిచేసిన ఆమె ఫేస్‌బుక్ కార్యాలయంలో మేనేజ్‌మెంట్ పూర్ గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా 50 మంది ఉండే ట్రెండింగ్ టీమ్ నుంచి 15 మంది రాజీనామా చేశారని ఆమె వెల్లడించారు….ట్రెండింగ్ టీమ్ లో 10 మంది మహిళలు ఉండేవారని, ఇప్పుడెంత మంది ఉన్నారో తెలియదని, మగాళ్లనే ప్రోత్సహిస్తారని ఆమె ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో మహిళలు మాట్లాడేందుకు అవకాశాలు తక్కువని, మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవడానికి వీల్లేదని ఆమె తెలిపారు.

మేనేజర్లు, ఎడిటర్లు మహిళా ఉద్యోగులను వేధిస్తుంటారని ఆమె వెల్లడించారు. ఫేస్‌బుక్ లో రాజకీయ పక్షపాతం లేదని ఆమె చెప్పారు. ట్విట్టర్ వాడకుండా ప్రత్యేక శిక్షణ ఇస్తారని ఆమె అన్నారు… షెడ్యూలు, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి పెంచుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టే నడుచుకోవాలని, ఎదురుచెప్పేందుకు వీలు లేదని ఆమె అన్నారు.. ఆమె చేసిన ఆరోపణలపై ఫేస్‌బుక్ సమాధానమిచ్చింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైనవని, దర్యాప్తు జరిపిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది మరి మీరు అక్కడ ఉద్యోగానికి ట్రై చేసే ముందు ఈ విషయాలపై బాగా ఆలోచించుకుని వెళ్లడం మంచిది. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీలో, ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా అవి అధిగ‌మించి ముందుకు వెళ్ల‌డ‌మే త‌మ ముందు ఉన్న ల‌క్ష్యం అంటున్నారు కొంద‌రు యువ‌త‌.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

సిక్కోలులో వైసీపీ – టీడీపీ వార్