రాగి పాత్రలు లేదా కాపర్ వాటర్ బాటిల్లోని నీళ్ళు తీసుకోవడం వలన ఫ‌లితాలు తెలిస్తే

347

ఇప్పుడు చాలా మందికి రాగిపాత్ర‌లు అంటే ఓల్డ్ అంటారు కాని గ‌తంలో 50 సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కూ ఇంటిలో ఏం చేసినా రాగిపాత్ర‌లే వినియోగించేవారు ఇప్పుడు స్టీల్ ప్లాస్టిక్ వ‌స్తువులే మ‌న‌కు క‌నిపిస్తున్నాయి ఇలా అనేక రోగాల‌కు కూడా కార‌ణం అవుతున్నాయి అయితే రాగి వాడ‌కం వ‌ల్ల ఆ పాత్ర‌లు ఎక్కువ‌గా వినియోగించ‌డం వ‌ల్ల ఎటువంటి ఆరోగ్య‌ఫ‌లితాలుఉంటాయి అనేది ఈరోజు మ‌నం తెలుసుకుందాం.

How Diabetics Can Benefit from Drinking Copper Treated Water
ముందు డ‌యాబెటిస్ గురించి తెలుసుకుందాం…డయాబెటిస్ మెల్లిటస్, రక్తంలోని అధిక చక్కెరల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని సూచిస్తుంది. WHO ప్రకారం, 18 సంవత్సరాలకు పైనున్న పెద్దవారిలో, ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ రోగుల ప్రాబల్యం పెరిగింది. ఈ నాలుగేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల ప్రకారం, దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలను చూపిస్తున్నాయి. 2030లో ప్రపంచవ్యాప్త మరణాలలో డయాబెటిస్ ఏడవ ప్రధాన కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ డయాబెటీస్ సమస్యలను ఉత్తమంగా నిర్వహించేందుకు ఒక సమర్ధనీయమైన గృహ నివారణా చిట్కా కూడా ఉంది, అదే రాగి పాత్రలలో నీటినితాగ‌డం.

రాగి, వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు కోసం

ఒక రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని తాగ‌డం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. వాస్తవానికి, దేశంలో అందరికీ తెలిసిన నీటి శుద్ధీకరణ యొక్క పురాతన రూపాలలో ఒకటిగా ఉంది. ఒక రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం ద్వారా, సహజ శుద్దీకరణ ప్రక్రియను సృష్టిస్తుందని చెప్పబడింది. క్రమంగా నీటిలోని మలినాలు తొలగి స్వచ్చమైన నీటిని అందిస్తుందని చెప్పబడింది. రాగి నీరు తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది నీటిలో ఉన్న సూక్ష్మజీవులను, శిలీంధ్రాలు, ఆల్గే మరియు బ్యాక్టీరియాలను సమూలంగా నాశనం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఒక రాగి పాత్రలో పూర్తిగా ఒక రాత్రి లేదా కనీసం నాలుగు గంటల పాటు నీటిని నిల్వచేయడం ద్వారా, రాగిలోని ప్రసిద్ద లక్షణాలు నీటిలో చేరి మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు డాక్ట‌ర్లు.

రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు
రాగి, వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు కోసం సూచించబడిన మరియు ముఖ్యమైన ఖనిజము. దురదృష్టవశాత్తు, మన శరీరంలోని జీవక్రియలు, రాగిని స్వతహాగా తయారు చేయలేని కారణాన, ఆహారం ద్వారానే ఈ ఖనిజాన్ని శరీరానికి అందివ్వలసిన అవసరం ఉంటుంది…రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేయడంలో, రోగనిరోధక పనితీరుని పెంచడంలో, ఎర్ర రక్త కణాలను మరియు చర్మ కణాల అభివృద్ధిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. డయాబెటిక్స్ తరచుగా ఎదుర్కొనే చర్మ సమస్యలు, వాపు మరియు వైద్యానికి ఆలస్యంగా స్పందించడం వంటి సమస్యలను తగ్గించగలవు. ఇక్కడ రాగి నీరు అత్యద్భుతంగా పనిచేస్తుంది. మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలతోపాటు రాగిని కూడా శరీరానికి అందివ్వగలిగితే, గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది.

ఆయుర్వేదం ప్రకారం,

ఆయుర్వేదం ప్రకారం, రాగి నీరు లేదా ‘తామ్ర జల్’ అనేక ప్రయోజనాలతో నిండి ఉంది. చర్మం ఆరోగ్యాన్ని పెంచడం, బ్యాక్టీరియా మరియు మంటతో పోరాడటం ద్వారా జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మధుమేహం నిర్వహణలో దాని పనితీరు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. రక్తంలోని చక్కెరల వలన ప్రేరేపించబడే కడుపులో మంట వంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చికిత్సగా ఉండగలదు. “ఒక కప్పు నీటిని ఒక రాగి పాత్రలో ఒక రాత్రి ఉంచి, మరుసటి ఉదయం ఆ నీళ్ళను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది.

వాస్తవానికి డయాబెటిస్ సమస్యను నిర్వహించడం అంత సులువైన అంశం కాదు, అలాగని పోరాడలేమని అర్ధం కాదు. సరైన ఆహార ప్రణాళిక, వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి మీ డయాబెటీస్ సమస్యను ఉత్తమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు ఉన్నాయని నిర్ధారించుకోండి.మ‌రి చూశారుగా రాగితో ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి. ఈ వీడియోని మీ స‌న్నిహితుల‌కు తెలియ‌చేసి వారికి కూడా రాగిపాత్ర‌ల వ‌ల్ల ఉప‌యోగాలు తెలియ‌చేయండి.