ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు…కానీ చివరికి భార్య సూసైడ్ చేసుకుంది..మొగుడు కోసం లెటర్ లో రాసింది చూస్తే కన్నీళ్లు రాక‌మాన‌వు

488

ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోవడం కంటే అదృష్టం ఇంకేం ఉంటుంది అని పొంగిపోయింది ఆ అమ్మాయి. అతడి కోసం కన్నవారినే ఎదిరించింది. కానీ భవిష్యత్తులో అదే తనకు శాపమవుతుందని ఆమె కలలో కూడా ఊహించలేకపోయింది. కట్టుకున్నవాడు కడదాకా తోడుంటాడని భావించింది. కానీ ఆ నీచుడు పైకి ప్రేమ నటిస్తూనే గుంటనక్కలా వ్యవహరించాడు. మోజు తీరగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది.

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నువ్వు లేకుండా బతకలేనన్నాడు. అతడి ప్రేమ నిజమని నమ్మింది ఆ యువతి. అతడి ప్రేమ కోసం తల్లిదండ్రులనే ఎదిరించింది. కానీ ఆ నీచుడు మోజు తీరాక అసలు స్వరూపం బయటపెట్టాడు. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యాపిల్లలను పట్టించకోవడం మానేశాడు. భార్యకు వేధింపులు మొదలుపెట్టాడు. భర్త మోసాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు తనను క్షమించాలంటూ తల్లిదండ్రులను వేడుకుంది. సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించింది. అమ్మానాన్న, అన్నా, అక్కా నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నేను తనువు చాలిస్తున్నాను. నా పిల్లలను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆమె రాసిన లెటర్.

ఈ ఘటన శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన అనురాధ… ఇంటర్ వరకు చదువుకుంది. ఆమె కాలేజీకి వెళ్తున్నస‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన యాదగిరి ప్రేమ పేరుతో అనురాధకు దగ్గరయ్యాడు. అయితే జులాయిగా తిరుగుతుండడంతో అతడితో పెళ్లికి ఒప్పుకోలేదు అనురాధ కుటుంబసభ్యులు. కానీ ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యాదగిరి… నువ్వు లేకుండా బతకలేనంటూ మొసలి కన్నీళ్లు కార్చాడు. అతడి ప్రేమ నిజమేనని భావించిన అనురాధ. తల్లిదండ్రులను ఎదిరించి ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత యాదగిరి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. భార్యపై మోజు తీరడంతో మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్య నిలదీయడంతో వేధింపులు మొదలు పెట్టాడు. జులాయిగా తిరిగేవాడితో తల్లిదండ్రులు పెళ్లి ఎందుకు వద్దన్నారో తలుచుకుని కుమిలిపోయింది. నేను తప్పుచేశాను, నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లెటర్ రాసింది. తను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కుటుంబసభ్యులను కోరింది.ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది అనురాధ ఆత్మహత్య చేసుకోవడంతో యాదగిరి పరారయ్యాడు… అనురాధ సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్నికొన్ని నిర్ణ‌యాలు పెద్ద‌లు చెప్పినా అమ్మాయిలు తీసుకుంటారు ఇలా ప్రేమ‌లో మోస‌పోతూ ఉంటారు చూశారుగా అమ్మాయిలు ఇలాంటి కేటుగాళ్ల ప్రేమ నుంచి జాగ్ర‌త్త‌గా ఉండాలి.