Breaking News:కన్యత్వ పరీక్షల్లో పాసై..పెళ్లి చేసుకుంటున్న సెక్సీ బ్యూటీ..ఎవరో తెలిస్తే షాక్

343

పిచ్చి పీక్స్ వెళ్లిపోవడంతో పెళ్లిని కూడా పాపులారిటీ కోసం వాడేస్తున్నారు ఇంటర్నెట్ సన్సేషన్ జంట రాఖీ సావంత్, దీపక్ కలాల్‌లు. త్వరలో మేం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పెళ్లి కార్డును షేర్ చేశారు. ‘ఎవరైతే ఏంటి పెళ్లి చేసుకోబోతున్నారు అదో శుభ పరిణామం. నాలుగు అక్షింతలు వేస్తే పనైపోతుంది’ అని సరిపెట్టేసుకునేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా వింతగా వ్యవహరిస్తోంది ఈ వివాదాస్పద జంట.

అప్పట్లో నేను పెళ్లి చేసుకుంటా ఎవరైనా ఉన్నారా? అంటూ స్వయంవరం పేరుతో ఓ ప్రోగ్రామ్ కూడా చేసింది రాఖీ సావంత్. తరువాత స్వయంవరంలో గెలిచిన వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి పెళ్లి లేదు గిల్లీ లేదని ముఖం చాటేసింది. ఆ తరువాత పలు వివాదాలల్లో వేలు పెడుతూ.. అప్పట్లో ఉవ్వెత్తున లేచిన ‘మీటూ’ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడి… తనూ శ్రీ దత్తాతో వివాదానికి దిగింది. తనూ శ్రీ దత్తాపై లైంగిక దాడి చేసిందని ఆరోపణలు చేసింది.

ఈ హాట్ సుందరి గురించి పక్కనపెట్టి ఆమె పెళ్లి చుసుకోబోయే వ్యక్తి దగ్గర వస్తే.. అతడు ఆమెకు మించిన వివాదాస్పద వ్యక్తి. సోషల్ మీడియాలో ఆడవాళ్ల లో దుస్తులు ధరించి ఆడ గొంతుతో పిచ్చి పిచ్చి వీడియోలను పోస్ట్ చేస్తూ.. ట్రోలింగ్ అవుతూ ఫేమస్ అయ్యారు. అప్పట్లో కాశ్మీర్ అంశంపై నోరుపారేసుకుని చేతులు కాల్చుకున్నాడు.