ఎవ్వరు ఉద్యోగం ఇవ్వడం లేదని ఒక కొత్త దారిలో ప్రయత్నించాడు…ఇప్పుడు ఏకంగా 200 కంపెనీలు ఆఫర్స్ ఇచ్చాయి.!

494

మనం ఎన్నో చదువులు చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాం.కానీ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా మనకు సరైన ఉద్యోగం లభించదు.అలాంటి పరిస్థితే ఒక వ్యక్తికి వచ్చింది. చదువుకున్నా కూడా ఉద్యోగం ఎవ్వరు ఇవ్వడం లేదని ఒక కొత్త దారిలో వెళ్ళాడు.అంతే అతని లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయ్యింది.ఉద్యోగం అతని కాళ్ళ దగ్గరకు వచ్చింది.మరి అతను చేసిన ఆ కొత్త ప్రయత్నం ఏమిటి.ఏం చేసి ఉద్యోగాన్ని సంపాదించాడు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం దొరకలేదని నిరాశచెందిన ఒక వెబ్‌డెవలపర్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. అతని పేరు డేవిడ్.మంచి చదువే చదువుకున్నాడు.డేవిడ్ టెక్సాస్ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశాడు. 2014 నుంచి 2017 వరకూ జనరల్ మోటార్స్‌లో పనిచేశాడు.ఏదో కారణంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో అతను ఉద్యోగ వేటలో పడ్డాడు కానీ ఎక్కడ ఉద్యోగం రాలేదు.ఉద్యోగవేటలో ఉన్న డేవిడ్ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి.

ఇంటికి వెళ్లాలని కూడా అతనికి అనిపించలేదు.ఓటమిని ఒప్పుకోలేకపోయాడు.అప్పుడే అతనికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది.ఆ ఆలోచనే రెజ్యూమ్‌ లను పంచడం.ఈ నిర్ణయమే అతని జీవితాన్ని మార్చివేసింది. అతను రోడ్లపై నిలుచుని తన రెజ్యూమ్‌లను పంచడం ప్రారంభించాడు. పైగా జనం తనను తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో ఒక ప్లకార్డును కూడా ప్రదర్శించాడు. దానిపై ‘ఇల్లులేదు, విజయం దక్కలేదు. దయచేసి రెజ్యూమ్ తీసుకోండి’ అని రాసివుంది. అదే దారిలో కారులో వెళ్తున్న జాస్మిన్ స్కాఫీల్డ్ అనే మహిళ అతణ్ణి చూసింది. అతనితో మాట్లాడి రెజ్యూమ్‌ తీసుకుంది.

ఆ రెజ్యూమ్‌తో పాటు ఆ యువకుని ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నా అని కూడా చెప్పింది అతనికి. ఆమె ఈ విషయాన్నీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఇది వైరల్‌గా మారింది. దీంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి.గూగుల్, నెట్‌క్లిక్స్, లింక్డ్‌ఇన్‌తో పాటు ఏకంగా 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇస్తామని ముందుకు వచ్చాయి.ఇప్పుడు అతగాడు ఓ మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు.విన్నారుగా ఉద్యోగం కోసం ఒక కొత్త ఆలోచనతో ముందుకు సాగి ఎలాంటి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడో.ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇతను ఒక ఆదర్శం కదూ.