గర్భిణికి హెచ్ఐవీ రక్తం కన్నీరు తెప్పిస్తున్న బాధితురాలి భర్త వ్యాఖ్యలు

330

ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం లేకనే ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్తున్నారు జనాలు. అక్కడ డబ్బులు ఎక్కువగా తీసుకున్నా గాని సరైన వైద్యం చేస్తారనే నమ్మకంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా సరైన వైద్యం అందక ప్రాణాలు విడిచేవారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రైవేట్ హోస్పిటల్ వాళ్ళు చేసే కొన్ని తప్పుల వలన మనుషుల జీవితాలే నాశనము అయ్యే స్థితికి వస్తుంది. ఇప్పుడు ఒక మహిళ విషయంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేసిన నిర్వాకం గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. మరి ఏమైందో తెలుసుకుందామా.తమిళనాడులోని విరుదు నగర్‌ జిల్లా సాత్తూరులో నివసిస్తున్న కూలీ కార్మికుడి భార్య (24) ఇటీవల గర్భం దాల్చటంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి శివకాశి ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రక్తాన్ని తీసుకువచ్చి ఆమెకు ఎక్కించారు. ఆ తర్వాత ఆమె మరింత బలహీనపడి తీవ్ర అస్వస్థతకు గురైంది. రెండు రోజులకు ముందు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమె రక్తాన్ని పరీక్షించి చూడగా అందులో హెచ్‌ఐవీ వైరస్ ఉన్నట్టు తెలియడంతో దిగ్ర్భాంతి చెందారు. ఈ సంఘటన గురించి ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు సాత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Image result for hiv

బ్లడ్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు జరిపిన తనిఖీలో గర్భిణీకి హెచ్‌ఐవీ రక్తం సరఫరా చేసినట్లు రుజువైంది. ఈ విషయంపై విరుదునగర్‌ జిల్లా వైద్య అధికారులు మనోహరన్‌, పళనిసామి బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్ళి విచారణ జరిపారు. ఆ సంఘటనకు సంబంధించి ఆ బ్లడ్‌ బ్యాంక్‌ ఉద్యోగిని వలర్మతిని సస్పెండ్‌ చేశారు.ఘటనపై బాధిత మహిళ సాత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాత్తూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను కలుసుకుని ఫిర్యాదును అందించారు. తనకు వైద్యచికిత్సలు చేసిన డాక్టర్లు, నర్సులు, శివకాశి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, బ్లడ్‌ బ్యాంక్‌ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు.ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సులు సహా నలుగురిని సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించారు. అలాగే బాధిత మహిళకు, ఆమె గర్భంలో వున్న శిశువును కాపాడేందుకు ముగ్గురు వైద్యనిపుణులతో నాణ్యమైన చికిత్సలందిస్తామని ఆర్యోగశాఖ కార్యదర్శి రాధా కృష్ణన్‌ తెలిపారు. అంతేకాదు, బాధితురాలి భర్తకు నెలకు రూ.25 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వైద్య గ్రామీణ ఆరోగ్యసంక్షేమ విభాగం సంచాలకులు డాక్టర్‌ రుక్మిణి ప్రకటించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ సందర్భంగా భాదిత మహిళ విలేఖరులతో మాట్లాడుతూ, బ్లడ్‌బ్యాంక్‌ ఉద్యోగుల తప్పిదం వల్ల తాను శాశ్వతంగా హెచ్‌ఐవీ రోగిగా మారానని, ప్రస్తుతం తన జీవితం నరకప్రాయంగా మారిందని బోరున విలపించారు. మూడు మాసాలుగా తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, నాలుగోసారి గర్భం దాల్చిన తనకు బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందనే నమ్మకం పోయిందని వాపోయారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరుగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. బ్లడ్‌ బ్యాంక్‌ ఉద్యోగులు రక్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే రోగులకు సరఫరా చేయాలని ఆమె ఆ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.చూశారుగా ఈ హాస్పిటల్ వాళ్ళు ఎంత పని చేశారో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా తప్పులు చేస్తూ మనుషుల జీవితాలతో ఆడుకునే హాస్పిటల్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.