నడిరోడ్డు మీద హిజ్రాలు ఇంత దారుణంగా చేస్తారా ఛీ ఛీ

267

దేవుడు మనుషులను స్పృష్టించాడు.ఆడ మగ అనే రెండు జాతులను కూడా స్పృష్టించాడు.అయితే ఈ తెగలనే కాకుండా మూడవ తెగను కూడా స్పృష్టించాడు.అదే హిజ్రా జాతి.వీళ్ళు మామూలు మనుషులే.పురాణ కాలం నుంచి వీళ్ళు ఉన్నారు.అయితే సమాజం ఎంత డెవలప్ అవుతున్నా హిజ్రాలు ఇంకా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.వారిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తారు. ఎక్క‌డికి వెళ్లినా వారికి అవ‌మానాలు, చీత్కారాలు త‌ప్ప‌వు. కొన్ని సంద‌ర్భాల్లో వారు కొంద‌రి చేతుల్లో చిత్ర హింస‌ల‌కు కూడా గుర‌వుతున్నారు. హిజ్రాలు మా పరువు తీస్తున్నారు.. వాళ్ళు చాలా ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తున్నారు.. చూళ్లేకపోతున్నాం.., అంటూ ఇలా చాలా మంది రకరకాలుగా హిజ్రాల మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హిజ్రాలు చెప్పే ఒకే ఒక మాట. అలాంటి పనులు చాలా మటుకు నకిలీ హిజ్రాలే చేస్తారు.

Image result for హిజ్రాలు

అసలు హిజ్రాలు చాలా మంచివాళ్ళు. కొన్ని సందర్భాలలో పోకిరీలు మరీ ఏడిపిస్తే చీర పైకి లేపుతారని వాళ్లు చెప్తారు. వాళ్లన్నట్టు కొంతమంది పనికి చేతకానివాళ్లు చీర కట్టుకుని, ముఖానికి పౌడర్ రుద్దుకుని హిజ్రాలా తయారై వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తారు. బయట అతణ్ణి చూసి చాలామంది నిజమైన హిజ్రానే అనుకుని దానం చేస్తారు. ఇలాంటివాళ్లతో అసలు హిజ్రాల పొట్టకొట్టినట్టు అవుతోంది. తమకు సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అసలు హిజ్రాలు మొత్తుకుంటున్నారు. అలాంటి ఓ నకిలీ హిజ్రా వరంగల్ నగరంలో భిక్షాటన చేస్తుంటే, అసలు హిజ్రాలు వచ్చి అతణ్ణి పట్టుకుని చితక్కొట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి 

స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని 12వ డివిజన్‌ ఎనుమాముల బాలాజీనగర్‌, మార్కెట్ జంక్షన్లలోని దుకాణాలు, హోటళ్లలోకి వెళ్లి ఓ నకిలీ హిజ్రా యాచిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అసలు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఆ నకిలీ హిజ్రాను పట్టుకుని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరగగడంతో హిజ్రాలు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. అరగంట పాటు నకిలీ హిజ్రాను కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వారిని అడ్డుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కొందరు స్థానికులు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటుండగా వారి సైరన్ మోత విని హిజ్రాలు అక్కడినుంచి పారిపోయారు. కాగా, ఈ ఘటనలో పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ట్రాఫిక్ స్తంభించింది.చూశారుగా దొంగ హిజ్రాకు ఎలా బుద్ధి చెప్పారో. మరి ఈ ఘటన గురించి అలాగే హిజ్రాల గురించి వాళ్ళు రోడ్డు మీద చేసే పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.