ఓ హిజ్రా స్టోరి రియల్ స్టొరీ ఈ కధ వింటే కన్నీళ్ళే

172

దేవుడు మనుషులను స్పృష్టించాడు. ఆడ మగ అనే రెండు జాతులను కూడా స్పృష్టించాడు.అయితే ఈ తెగలనే కాకుండా మూడవ తెగను కూడా స్పృష్టించాడు.అదే హిజ్రా జాతి.వీళ్ళు మామూలు మనుషులే.పురాణ కాలం నుంచి వీళ్ళు ఉన్నారు.అయితే సమాజం ఎంత డెవలప్ అవుతున్నా హిజ్రాలు ఇంకా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.అమ్మనాన్న దగ్గర నుంచి సమాజంలో ఎవరో కూడా తెలియని వ్యక్తుల వరకు అందరు హిజ్రాలను ఏడిపించేవారే ఉన్నారు.అలా ఎన్నో సమస్యాలను ఎదుర్కొని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక హిజ్రా తన జీవితం గురించి తానే చెప్పుకుంది.మరి ఆమె జీవితం గురించి ఆమె మాటల్లోనే విందాం.

నా పేరు జగదీష్‌. బయటి ప్రపంచానికి నేను బాలుడిగా తెలుసు. సమాజం నన్ను అలాగే అంగీకరించింది. అప్పుడు నాకు 8 సంవత్సరాలు. ఇంట్లో అందరూ బయటకు వెళ్లే వరకు ఓపిక పట్టేవాడిని. ఆ తరువాతే నాకు స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపించేది. అందరూ వెళ్లిపోయాక టవల్‌ తీసుకుని నా తలకు చుట్టుకునేవాన్ని. అమ్మకు చెందిన కాటుక, లిప్‌స్టిక్‌ రాసుకునేవాన్ని. ఆమె బ్రా ధరించే వాన్ని. చీరకట్టుకునే వాన్ని. అలా పూర్తిగా అమ్మాయిగా మారేవాన్ని. నాలో ఉన్న నిజాన్ని అద్దమే బయట పెట్టేది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకపోయేవాడిని.స్కూల్‌లో చాలా గడ్డు పరిస్థితులు నాకు ఎదురయ్యేవి. నా చేష్టలన్నీ ఆడపిల్లలను పోలి ఉండేవి. దీంతో తోటి విద్యార్థులు నన్ను ఎగతాళి చేసేవారు. కొందరు బాలురు నన్ను కంపాస్‌తో కొట్టేవారు.

నాకు రక్తం వచ్చేదాకా కొట్టడం ఆపేవారు కాదు. స్కూల్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు వేసేవాళ్లం. వాటిలో నేను ఎక్కువగా అమ్మాయిలా కనిపించేవాన్ని.రాను రాను నాకు కష్టాలు మరింత పెరిగాయి. ఒకసారి నా జననావయవాలను చూపించాలని స్కూల్‌లో తోటి విద్యార్థులు గోల చేశారు. నన్ను టాయిలెట్‌లోకి తీసుకువెళ్లి రేప్‌ చేసినంత పని చేశారు. విషయం అమ్మానాన్నలకు తెలిసింది. వారు సిగ్గుగా ఫీలయ్యారు. నాన్న నన్ను ఇంటికి తీసుకువచ్చి నా కాళ్లపై సలసలా మరిగే నీటిని పోశారు. అలా చేస్తే నాలో ఉన్న అమ్మాయి లక్షణాలు పోతాయని ఆయన నమ్మాడు. దీంతో 3 నెలల పాటు నేను బయటకు వెళ్లలేకపోయా. అయితే ఇదంతా నా ఖర్మ అని భావించి ఒకసారి నేను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించా.ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా కానీ ఎందుకో మనసొప్పలేదు. ఆ సందర్భంలో కలిగే నొప్పి, బాధను ఊహించుకుంటేనే నాకు భయం వేసింది. అందుకే ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకున్నా. సమాజంలో స్త్రీ లేదా పురుషుడిగా జీవిస్తేనే గౌరవం దక్కుతుందని, నా విషయంలో ఇలా జరిగినందుకు అది నా తప్పనే నేను భావించా.

ఒక రోజు ఒక పార్కులో హిజ్రాలు కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్లి నా సమస్యలను చెప్పా. వారు నన్ను తమతో ఉండమని ఆహ్వానించారు. అయితే వారితో ఉండడం అంత సులభేమీ కాదు. ఎందుకంటే వారు నా చేత రోజు ముష్టి ఎత్తించేవారు. ఒక రోజు రూ.20 కోసం నాతో వారు ఓరల్‌ సెక్స్‌ చేయించారు.4 ఏళ్ల పాటు నేను అలాంటి సెక్స్‌ పనులు చేశా. ఆ పనుల్లో లభించే డబ్బును కొంత కొంతగా దాచుకున్నా. దాంతో సెక్సు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నా. అయితే కథ అక్కడితో అయిపోలేదు. 2004లో ఓ ఆర్గనైజేషన్‌లో జాయిన్‌ అయ్యా. హిజ్రాల స్థితిగతులపై రీసెర్చ్‌ చేయాలనిపించింది. దీంతో నేనే సొంతంగా ఓ ఆర్గనైజేషన్‌ పెట్టా. దాని పేరు ఒండెడ్. దాని ద్వారా మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల కోసం ఉద్యమించడం ప్రారంభించా.

ఈ క్రింది వీడియో ని చూడండి

25 సంవత్సరాలుగా హిజ్రాల కనీస హక్కుల కోసం ఉద్యమిస్తున్నా. నేను చేసిన ప్రయత్నానికి ఫలితం లభించినట్లే అనిపించింది. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని నాకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. దీని గురించి నేను టెడ్‌ఎక్స్ టాక్‌లో మాట్లాడా. నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం నేను వివాహం చేసుకోవడమే. రాష్ట్రంలోనే మొదటి హిజ్రా వివాహం నాదే కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ ఖ్యాతి నన్ను ప్రేమించిన , పెళ్లి చేసుకున్న ఆయనకే దక్కుతుంది. అయితే కొద్ది రోజుల కిందటే టీవీలో చూశా.. సెక్షన్‌ 377 పై సుప్రీం తీర్పు చెప్పింది. అప్పుడు నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే.. మాకు కూడా ఇక స్వేచ్ఛ లభించింది కదా అని ఆ హిజ్రా తాను ఎదుర్కొన సమస్యలను సాధించిన విజయాలను చెప్పుకొచ్చింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ హిజ్రా గురించి అలాగే ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి సాధించిన దాని గురించి అలాగే సమాజంలో హిజ్రాలు ఇప్పటికి ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.