పుల్వామా దాడి ఘటన తర్వాత ఆర్మీ ఆఫీసర్ కి కాల్ చేసి హీరో విజయ్ ఏం మాట్లాడాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

268

పుల్వామా ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త వాయిసేన ద‌ళం ఫిబ్ర‌వ‌రి 26న పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో 300కి పైగా ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం. ఇక శత్రువుల విమానాన్ని వెంటాడి, దానిని సాహసోపేతంగా కూల్చివేసి అదే క్రమంలో తానూ దాడికి గురై.. శత్రువుల భూభాగంలో పడిపోయారు వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్‌.

Image result for vijay phone call

నిన్న రాత్రి ఆయ‌న భార‌త భూభాగంలోకి అడుగుపెట్టారు. దీంతో భార‌తీయుల‌లో ఆనందం వెల్లివిరిసింది. అయితే త‌మిళ హీరో విజ‌య్ త‌న అభిమాని అయిన ఆర్మీ ఆఫీస‌ర్ త‌మీజ్ సెల్వ‌న్‌తో ప్ర‌స్తుతం ప‌రిస్థితుల గురించి ఫోన్‌లో అడిగి తెలుసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

Image result for vijay phone call

ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ స్వ‌యంగా ఆఫీస‌ర్‌కి కాల్ చేసి బోర్డ‌ర్ దగ్గ‌ర ప‌రిస్థితులకి సంబంధించిన‌ వివ‌రాలని ఫోన్‌లో అడిగారు. ఆప‌రేష‌న్ స‌క్సెస్ ఫుల్‌గా జ‌రిపినందుకు సంతోషంగా ఉంద‌ని విజ‌య్ అన్నారు. అంతేకాదు కాశ్మీర్ నుండి తిరిగొచ్చాక త‌ప్ప‌క క‌లుద్దాం అని కూడా చెప్పార‌ట‌.

Image result for vijay

గ‌త రాత్రి నుండి విజ‌య్‌- ఆర్మీ ఆఫీస‌ర్‌ల మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. త‌మీజ్ సెల్వ‌న్ త‌మిళ‌నాడుకి చెందిన వ్య‌క్తి కాగా, ఆయ‌న 17 ఏళ్ళుగా దేశానికి సేవ‌లు అందిస్తున్నాడు. పీక్ టైంలో బోర్డ‌ర్ ద‌గ్గ‌ర త‌న‌ సేవ‌ల‌ని అందిస్తుంటారు త‌మీజ్‌. విజ‌య్‌కి ఈ ఆర్మీ ఆఫీస‌ర్ పెద్ద వీరాభిమాని కాగా గ‌తంలో వీరిరివురు ప‌లుమార్లు క‌లిసిన‌ట్టు స‌మాచారం.