హీరో నాని భార్య అంజ‌నా ఇంట్లో ఒకే రోజు ముగ్గురు మృతి విషాదంలో కుటుంబం

795

జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు,నష్టాలూ,కన్నీళ్లూ కూడా ఉంటాయి. హీరో నాని భార్య అంజనా విషయంలోకి వెళ్తే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు కనిపిస్తాయి. ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా ఎన్నో అద్భుతాలు సృష్టించి,విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పద్మశ్రీ నాయుడమ్మకు ఈమె స్వయానా మనవరాలు. ఆయ‌న పేరు ఇప్పుడు త‌రానికి తెలియ‌క‌పోయినా చాలా మందికి ఆయ‌న ఆనాడు ఓ పెద్ద రోల్ మోడ‌ల్. నాయుడమ్మ అంటే ఆనాటి తరానికి ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఎందరో విద్యార్థులకు అపూర్వ గురువుగా పేరుతెచ్చుకున్నారు. చర్మశుద్ధి పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రజల కోసం శ్రమించిన మనిషి గుర్తొస్తారు. ఇలా సామాన్య జనం నుంచి శాస్త్ర సాంకేతిక రంగం వరకూ అందరూ ఆయ‌న‌ని గుర్తుపెట్టుకుంటారు.. 1985జూన్ 23న జరిగిన కనిష్క విమాన ప్రమాదంలో నాయుడ‌మ్మ మరణించారు. మొత్తం 329మంది ప్రయాణికులు చనిపోతే అందులో నాయుడమ్మ మృతదేహం ఆచూకీ కూడా దొరకలేదు. నాయుడమ్మకు ముగ్గురు సంతానం.

నాయుడమ్మ పెద్దకుమారుడు రితేష్ ఆయ‌న కూతురు నాని భార్య అంజనా… ఇక రెండో కుమారుడు రమేష్ కూతురు శాంతి. ఇక రితేష్ కూడా నాయుడమ్మ మాదిరిగా లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చేసారు. తోళ్ల సుద్ధి గురించి స్పెయిన్ లో నాన్నద‌గ్గ‌ర‌ నేర్చుకున్నారు. ఆతర్వాత విజయనగరంలో లెదర్ ఫ్యాక్టరీ పెట్టి, విజయవంతంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర యడవర్రు కి చెందిన అంజనా కూడా సైన్స్ పట్టభద్రురాలు. వైజాగ్ గీతమ్స్ లో ఐటి విభాగంలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక,కార్పొరేట్ కమ్యూనికేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.

అంజనా తమ్ముడు వరుణ్ కూడా తాత‌గారిలాగే ప్రతిభావంతుడు. ఇక కాటా చంద్రదాస్ గారు నాయుడమ్మ విజయాలు,వివిధ అంశాలు క్రోడీకరించి ఓ పుస్తకం రాసారు.వికె సారస్వత చేతులమీదుగా ఆవిష్కరించబడిన ఈ పుస్త్తకం లో చాలా విషయాలు పొందుపరిచారు. అంజనా జీవితంలో తాతయ్య నాయుడమ్మ మరణం తీరని విషాదం అయితే ఆయన మృతదేహం తేవడానికి కొడుకు రితేష్ వెళ్ళాడు. అయితే నాయుడమ్మ లేని జీవితం తనకు వద్దని ఆయన భార్య అయినా పవనా బాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.. మద్రాసులో మంచి గైనకాలజిస్ట్ గా సేవలందించిన ఆమె మరణంతో అంజనా తండ్రి నాలుగైదు రోజుల వ్యవధిలోనే అమ్మా నాన్న లను పోగొట్ట్టుకున్నారు.