ఆమె ఖ‌రీదు 80 వేలు ఈ స్టోరీ వింటే క‌న్నీరు రాక మాన‌దు.

457

మ‌హిళ‌ల‌కు ఎక్క‌డికి వెళ్లినా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. దారుణ‌మైన హింస‌ల‌కు గురిచేసి రాక్ష‌సానందం పొందే వారు, చాలా మంది ఉంటున్నారు. మ‌హిళ‌ల‌ను వేధించి వికృతానందం పొందే అమానుషులు ఉన్నారు. యూపీలో జ‌రిగిన ఇలాంటి ఘ‌ట‌న యావ‌త్ ప్ర‌జ‌ల‌ను క‌న్నీరు పెట్టించింది.. ఇలాంటి వారికి సంఘం త‌ర‌పున స‌పోర్ట్ ల‌భించ‌డం కూడా అంద‌రిని ఆశ్చ‌ర్యానికి లోనయ్యేలా చేసింది…బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే, శీలానికి వెలకట్టారు గ్రామ పెద్దలు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాల్సిందిపోయి.. ఆ బాలిక శీలానికి రూ.80వేలు వెలకట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

Image result for girls

అలీఘడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత బాలికకు తల్లిదండ్రులు మరణించడంతో సోదరుడు ఒక్కడే ఉన్నాడు. గ్రామ పెద్దలు సమావేశమై అత్యాచారం చేసిన నలుగురు కామాంధులు బాధిత బాలికకు రూ.80వేలు జరిమానాగా చెల్లించాలని పంచాయితీలో తీర్పు చెప్పారు.

Image result for girls

గ్రామ పెద్దల పంచాయితీపై మండిపడిన బాలిక సోదరుడు… తమకు నష్టపరిహారం అక్కరలేదని, నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన చేతన్, లఖన్ , లలిత్ కుమార్, వికాస్ ల‌పై ఐపీసీ సెక్షన్ 376 డి, 354, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పంచాయితీ పెద్దల తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి సోదరుడిపై గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ విష‌యంలో పోలీసులు గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌ల‌ను ఇంకా స‌మాజంలో జ‌రుగుతున్నాయి. మూడ‌న‌మ్మ‌కాలు ఇంకా ఎలా స‌మిసిపోలేదో, ఇలాంటి ఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా కుల పెద్ద‌లు సంఘ పెద్ద‌ల వ‌ల్ల ఇలాంటి అమ్మాయిల జీవితాలు డ‌బ్బు అనే మ‌దంతో న‌లిగిపోతున్నాయి. ఆ యువ‌కుడికి పోలీసులు అండ‌గా నిలిచినా ఊరివారికి రాజ‌కీయ నాయ‌కుల స‌పోర్ట్ ఉండ‌టంతో, పోలీసులు కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్దితి ఏర్ప‌డింది. చూశారుగా నాయ‌కుల చేతిలో వీరు కీలుబొమ్మ‌లుగా మారిపోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వారికి బుద్ది వ‌చ్చేలా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.