ఆ కోడికి త‌ల‌తెగింది. అయినా18నెలలు బ‌తికింది..ఎలాగో తెలిస్తే షాక్

368

భూమ్మీద జ‌న్మించిన ఏ జీవికైనా మ‌నిషితో స‌హా త‌ల, మొండెం కాళ్లు శరీరంలో చాలా భాగాలు ఖచ్చితంగా ఉంటాయ‌ని మనకు తెలిసిన విషయమే. కాక‌పోతే కొన్ని ప్ర‌త్యేక‌మైన జీవుల‌కు ఇవి ఉండ‌వు. అది వేరే విష‌యం. కానీ మెజారిటీ జీవాల‌కు త‌ల‌, మొండెం ఉంటాయి.అయితే మన శరీరంలో ఏ భాగమైన మన నుంచి పోతే తట్టుకోగలమా.కాళ్ళు చేతులు లాంటివి పోతే ఎలాగోలా బతికేస్తాం కానీ మొండెం నుంచి త‌ల‌ను వేరు చేస్తే అప్పుడు ఆ జీవి బ‌తికే అవ‌కాశం ఉంటుందా ? క‌చ్చితంగా ఉండ‌దు. కొంచెం అటో, ఇటో మొండెం నుంచి త‌ల వేరు కాగానే ఆ జీవి చ‌నిపోతుంది.అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న ఆ కోడి మాత్రం అలా కాదు. ఓ వైపు త‌ల తెగింది. అయినా వారం రోజుల పాటు బ‌తికింది.షాకింగ్గా ఉన్నా ఇది నిజం.మరి ఆ కోడి విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వింత వింత వార్తలు తెగ హల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని వార్తలు..సంఘటనలు సోషల్ మీడియా పుణ్యమా అని చూస్తున్నాం. తాజాగా థాయిలాండ్‌లో రచ్చుబురి రాష్ట్రంలో ఒక వింత చోటు చేసుకుంది. తల తెగిపోయి వారం రోజులు దాటినా ఓ కోడి నిక్షేపంగా బతికే ఉంది. రాట్చ్ బురి అనే ప్రాంతంలో వేరే జంతువుతో పోరాడిన కోడి తలను కోల్పోయింది.తల తెగిపడినా ఆ కోడి నడుస్తూనే ఉంది. ఆ కోడిని చూసిన యజమాని ఒక్కసారే షాక్ కి గురయ్యాడు..సాధారణంగా తల తెగిన కొద్ది సమయానికి ఏ జంతువైనా పక్షి అయినా చనిపోవడం సహజం కానీ ఆ కోడి మాత్రం మిగతా కోళ్ల మాదిరిగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. బతకాలన్న దాని తపనను చూసి ముచ్చట పడిన డాక్టర్.. రక్తస్రావం ఆగడానికి సర్జరీ చేశాడు.

మెడ కింది భాగాన ద్రవాల రూపంలో ఆహారాన్ని అందిస్తున్నారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్ అందిస్తున్నారు. దీంతో ఆ కోడి చురుగ్గా స్పందిస్తోందని డాక్టర్ తెలిపారు. కాకపోతే..దాని నాలుక ఎండిపోయి ఊడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.అయితే నిజానికి ఇలా జ‌ర‌గ‌డం మొదటి సారేమీ కాద‌ట‌. గ‌తంలో.. అంటే.. 1947లో అమెరికాలోని ఉతాహ్‌లో కూడా ఇలాగే త‌ల తెగిన కోడి ఒక‌టి ఏకంగా 18 నెల‌ల పాటు బ‌తికింది. ఇప్పుడు ఈ కోడి వారం పాటు బ‌తికింది. అవి అలా ఎలా బ‌తికాయో ఇప్ప‌టికైతే సైంటిస్టుల‌కు కూడా అర్థం కాలేదు. కానీ.. ఏది ఏమైనా కోడి ఇలా త‌ల తెగినా బ‌త‌క‌డం అంటే నిజంగా షాకింగ్ విష‌య‌మే క‌దా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.