హిమగిరి సొగసుల్లో సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురించి మీకోసం..

271

మన భారతదేశం పురాణాలకు పుట్టినిల్లు.భారతదేశం దేవుడిని కొలుస్తారు.ఎన్నో రకాల మతాలు ఇక్కడ ఉన్నాయి.ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు.ఆ దేవుళ్లందరికి ఇక్కడ గుళ్ళు ఉన్నాయి.అయితే మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉన్న సిక్కు మతస్థులకు కూడా ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి.అందులో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆలయం హేమకుండ్ ఆలయం.ఆ ఆలయం గురించి ఇప్పుడు చెబుతా వినండి.

హేమకుండ్ సాహేబ్ సిక్కుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనిని గురుద్వార శ్రీ హేమకుండ్ సాహేబ్ జీ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర ఖండ్‌లోని చమోలి జిల్లా హేమకుండ్‌లో ఉన్న ఒక సిక్కుల పరమ పవిత్రమైన యాత్రా స్థలం. సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్‌ను ఇక్కడ ప్రధానంగా పూజిస్తారు. హేమకుండ్ సముద్ర మట్టానికి దాదాపు 15,197 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమాలయ పర్వత పంక్తుల్లోని తూర్పు భాగంలో ఈ హేమకుండ్ ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకూ మాత్రమే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వీలవుతుంది. మంచు కురువడంతోపాటు విపరీతమైన చలిగాలుల వల్ల అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఈ పర్వతమయ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వీలుకాదు. చలికాలం వల్ల మూసుకుపోయిన రహదారిని సరిచేయడానికి సిక్కులు మే నెలలో స్వచ్చందంగా ఇక్కడికి వస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న కొన్ని హోటల్స్, టెంట్ హౌస్‌లు ఉంటాయి.

హేమకుండ్ సాహేబ్, ఉత్తరాఖండ్

కేవలం పగటి పూట మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. అందువల్ల రాత్రి సమయంలో ఇక్కడ ఉండటానికి వీలుకాదు. దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శించినవారు గోవింద్‌ఘాట్‌కు వెలుతూ ఉంటారు.గోవింద్ సాహేబ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పాల పర్వత లోయల ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. ఈ పర్వతలోయల ప్రాంతం 5 కిలోమీటర్ల మేర పువ్వుల వనం ఉంటుంది. భారతదేశం ఈ ప్రాంతాన్ని బయో రిజర్వ్ అని ప్రకటించింది. ఈ ఫ్లవర్ వ్యాలీని చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. జులై ఆగస్టు నెలల్లో ఈ ఫ్లవర్ వ్యాలీని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న బ్రహ్మ కమల పుష్పం 12 ఏళ్లకు ఒకసారి విరబూస్తుంది. హేమకుండ్ సరోవరం హేమకుండ్ సాహేబ్ గురుద్వారకు సమీపంలో ఉంది. ఈ సరోవరం ఈ ప్రాంతం అందాన్ని మరింతగా పెంచుతుంది. గురుద్వారకు వచ్చే భక్తులు ఈ పవిత్ర సరోవరంలో స్నానం చేసి హేమకుండ్ సాహేబ్‌కు వెలుతూ ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హేమకుండ్ సాహేబ్ నుంచి 310 కిలోమీటర్ల దూరంలో డెహ్రడూన్‌లో జోలి గ్రాంట్ విమానాశ్రయం ఉంది. అదేవిధంగా హేమకుండ్ సాహేబ్‌కు దగ్గర్లో అంటే అంటే డెహ్రడూన్, హరిద్వార్‌లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి హేమకుండ్ చేరడానికి బస్ లేదా క్యాబ్ ద్వారా కూడా చేరుకోవచ్చు. జోషి మఠం నుంచి హరిద్వార్, డెహ్రడూన్ మధ్య ప్రైవేటు బస్సుల సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఢిల్లీ నుంచి రైలు ద్వారా హరిద్వార్‌ను మొదట చేరుకుని అటు పై రిషికేష్ ద్వారా గోవింద్‌ఘాట్‌కు బస్ ద్వారా ప్రయాణం చెయ్యవచ్చు..ఇదేనండి సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అయినా హేమకుండ్ యొక్క విశిష్టత.అక్కడ ఉన్న విశేషాలు.మరి హేమకుండ్ క్షేత్రం గురించి అక్కడ ఉన్న విశేషాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.