భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు షాపుల ముందు క్యూ క‌డుతున్న జ‌నం

510

వరుసగా మూడు రోజులపాటు పెరిగిన బంగారం ధరలు.. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో.. దిగొచ్చాయి. ఈ మేరకు బులియన్ మార్కెట్‌లో గ‌డిచిన వారం 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,780 నుంచి రూ.32,630 దిగొచ్చింది. ఒకవైపు పసిడి ధరలు తగ్గగా.. వరుసగా పతనమవుతున్న వెండి ధరలు మ‌రింత పుంజుకున్నాయి. దీంతో బులియన్ మార్కె‌ట్‌లో రూ.310 పెరిగిన కిలో వెండి ధర రూ.39,500కి చేరింది.తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 150 రూపాయలు తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,630 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,480 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. గ‌త వారం నుంచి ఉన్న ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0..03 శాతం తగ్గి 1,222.41 కి చేరింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది. ధన త్రయోదశి ప్రభావంతో తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. దీపావళి పండుగ నేపథ్యంలో బుధవారం (నవంబరు 7) మరింత తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం 210 రూపాయలు తగ్గి.. రూ.32,400 కి చేరింది. వెండి ధర కూడా 300 పతనమై రూ.39,000 కి చేరింది. పసిడి ధర రూ.210 తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,250 కి చేరింది.

ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.24,800 గా నమోదైంది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు పెరిగాయి. నేటి ట్రేడింగ్‌లో 0.7 శాతం పెరిగిన ఔన్సు బంగారం ధర 1,234.30 డాలర్లకు చేరింది. ఇక వ‌రుస‌గా బంగారం ఈ వాతం త‌గ్గ‌డంలో కొనుగోలు ధారులు క్యూ క‌డుతున్నారు ఇక ముంబై చెన్నై హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర‌లు మ‌రింత త‌గ్గాయి అయితే స్టోరుల్లో మాత్రం బంగారు కాయిన్స్ ఎక్క‌డా అందుబాటులో లేవు తాజాగా ఆర్న‌మెంట్ల వ్యాపారం పుంజుకుంటోంది అని గోల్డ్ కాయిన్ల పై పెట్టుబ‌డి పెట్ట‌డం లేదు అని చెబుతున్నారు ట్రేడ్ వ‌ర్త‌కులు