48 గంటల్లో ఏపీ తెలంగాణకు జలవిలయం బయటకు రావద్దు

251

దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, బిహార్‌లోని పలు ప్రాంతాలలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ముంబై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబైవాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఇటు, తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కరుణ చూపుతున్నాడు. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. ఈ పరిస్థితి ఇలాగే మరో రెండు రోజుల కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలకు రోడ్లలపై గుంతలు ఏర్పడ్డాయి. భాగ్యనగరంలో మొత్తం 4 వేలకుపైగా గుంతలు ఏర్పడినట్టు తేలింది. అధికారులు చేపట్టిన మరమ్మత్తులపై జనం పెదవి విరుస్తున్నారు. వర్షం నీరు గుంతల్లోకి చేరడంతో ప్రమాదానికి గురవుతున్నామని వాపోతున్నారు.

Image result for heavy rains

అలాగే పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉందని పేర్కొన్నారు.

Image result for heavy rains

ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో తీవ్రంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువున ఉన్న రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. ఈ పరిస్థితి ఇలాగే మరో రెండు రోజుల కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలకు రోడ్లలపై గుంతలు ఏర్పడ్డాయి.

Image result for heavy rains

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంకు జలశోభతో కళకళలాడుతోంది. మరో నాలుగు రోజులు వరద కొనసాగితే, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు హంద్రీనీవాకు, తెలుగుగంగ కెనాళ్లకు నీరందించే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వస్తున్న నీటిపై రాయలసీమ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 125 టీఎంసీల నీరు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 2,62,064 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే నీటి ప్రవాహం కొనసాగితే, రోజుకు 25 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది.

మొత్తం 666 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నార్నూర్‌లో 109, హీరాపూర్‌లో 107, గుడిహత్నూర్‌లో 95, లచ్చోడలో 87, కెరమెరిలో 71.8, సిరికొండలో 61, రాంనగర్‌లో 60, ఆదిలాబాద్‌లో 58 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలతోపాటు అగ్నిమాపక సిబ్బందిని సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరాల సరఫరాకు జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించారు సీఎం . ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనం సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. జాప్యం లేకుండా నిత్యావసరాలు అందించాలని సూచించారు.