అక్టోబరు 5 వరకు చురుకుగా నైరుతి.. ఏపీ, తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు!

212

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో ఆగస్టు రెండో వరకు లోటు వర్షపాతం నమోదయ్యింది. అయితే, గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు మొదలైన నాటి నుంచి సెప్టెంబరు 26 వరకు దేశవ్యాప్తంగా 107 శాతం వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే ఎక్కువ. నైరుతి ముగియడానికి ఇంకా రెండువారాల కంటే ఎక్కువ సమయం ఉందని, ఈ పదిహేను రోజుల్లో మరిన్ని ఎక్కువ వర్షాలు కురిసి వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, ఏపీ, తెలంగాణలో రుతుపవనాలు అక్టోబరు 5 వరకు బలంగా ఉంటాయని, అప్పటిదాకా రాయలసీమ, తెలంగాణల్లో కనీసం 2 సార్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మాజీ డైరెక్టరు జనరల్‌ కేజే రమేష్‌ వెల్లడించారు. మూడేళ్లుగా వాతావరణశాఖ అంచనాలు నిజమవుతున్నాయని, తమ హెచ్చరికలకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కాకపోవడంవల్లే వరద ముంపు తలెత్తుతోందని ఆయన అన్నారు.

Image result for rains

రాబోయే పది రోజుల్లో ఇటీవల హైదరాబాద్‌, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల్లాంటివి కనీసం రెండు రాయలసీమ, తెలంగాణల్లో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అధికార యంత్రాంగాలు ముందుగా అప్రమత్తమై క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటే మేలు. ఈసారి ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండబోతున్నాయి. అందువల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు, మధ్య కర్ణాటకలో మంచి వర్షాలు కురుస్తాయి. భారత వాతావరణశాఖ అంచనాల్లో కచ్చితత్వం పెరిగింది. ఇదివరకు స్టాటిస్టికల్‌ మోడల్‌ ద్వారానే అంచనాలు వేసేవాళ్లం. ఇప్పుడు సముద్ర వాతావరణాన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. వాతావరణ మార్పులన్నీ సముద్రాల్లోనే కనిపిస్తున్నాయి.

Image result for rains

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తిరోగమనం కావాల్సి ఉన్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాలుగైదు వారాల నుంచి మధ్య, పశ్చిమ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు కారణం వాతావరణ మార్పులే. గత ఏడాది వర్షాలు సాధారణం కంటే 8% తక్కువ కురిశాయి. ఈ ఏడాది ఎల్‌నినో వస్తుంది. వర్షాలు కురవవు అని పలు సంస్థలు అంచనాలు కట్టినప్పటికీ, అందుకు భిన్నంగా వానలు విస్తృతంగా పడతాయని ఐఎండీ తరఫున మేం ప్రకటించాం. ప్రస్తుతానికి సాధారణంకంటే 7% ఎక్కువ కురిశాయి. ఇందుకు ప్రధాన కారణం ఆఫ్రికా సమీపంలో హిందూ మహాసముద్రం వెచ్చగా ఉండటంవల్ల రుతుపవనాలు క్రియాశీలంగా ఉంటాయి. ఎల్‌నినో లేకపోవడం, ఐవోడీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మంచి వర్షపాతం ఉంటుందని మేం వేసిన అంచనాల్ని నిజం చేస్తూ పశ్చిమతీరంలో భారీ వర్షాలు కురిశాయి.

ఈ క్రింద వీడియో చూడండి

ఫలితంగా 10 రోజుల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు నిండాయి. దేశవ్యాప్తంగా 146 నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షపాత వివరాలను ఐఎండీ ప్రతిరోజూ పర్యవేక్షిస్తుంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సరైన సమన్వయం ఉంటే భారీ వర్షాలతో వచ్చే వరద ముంపు ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని అయన తెలిపారు. ఇకపోతే గత ఐదేళ్లుగా దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువే నమోదవుతోంది. ఈ సారి మాత్రం వర్షాలు విస్తారంగా కురిశాయని, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నైరుతి తిరోగమన కాలం సెప్టెంబరు 1న మొదలై 30 నాటికి దేశం నుంచి వెళ్లిపోతాయి. అయితే ఈ ఏడాది మాత్రం రుతుపవనాల తిరోగమన కాలం ఇంకా ప్రారంభకాకపోవడం విశేషం.