24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు షాక్

147

ఓ పక్క దేశంలో వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి. ఉత్తరాది ప్రాంతాలు వర్షంతో తడిసిముద్ద అవుతున్నాయి. ఇక ఈశాన్య ప్రాంతాలు కూడా వర్షంతో మునుగుతున్నాయి.. భారీ వర్షాలతో సుమారు 15 రాష్ట్రాలు తడిచాయి. ఇక సౌత్ సెంట్రల్ స్టేట్స్ మాత్రం వర్షం కోసం ఎదురు చూస్తున్నాయి ఓ పక్క కేరళలో అనుకున్న రీతిలో వర్షాలు కురుస్తున్నాయి. కాని చెన్నై ,ఏపీ ,తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురవడం లేదు.. వర్షాకాలం రెండు నెలల కాలం పూర్తి అవుతున్నా ఇంకా సరైన వర్షం కురవలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం కూడా వర్షపాతం లేదు అంటున్నారు వాతావరణశాఖ అధికారులు.

Image result for rains

తాజా రెయిన్ అప్ డేట్ చూస్తే, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం (ఎన్డీఎంఏ) ధృవీకరించింది. వచ్చే 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలియజేసింది..కాని ఏపీకి మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది అలాగే తెలంగాణలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

ఈ క్రింద వీడియోని చూడండి

ఈ విషయాన్ని ఎన్డీఎంఏ బుధవారం మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా జారీ చేసింది.కొంకణ్, గోవా, హిమాలయా ఉప ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం,బిహార్, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, అసోం, మేఘాలయా వంటి ఈశాన్యా రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.రాజస్థాన్ తూర్పు ప్రాంతం, కేరళ, మహె, కర్ణాటక దక్షిణ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో గంగానదీ తీర ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో మరింత వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది భారత వాతావరణ శాఖ.

Image result for rains

అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు ఆ శాఖ అధికారులు.. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ అధికారులు వరుసగా ట్వీట్లను సంధించారు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల పేర్లు ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా తమిళనాడుల్లో ఇప్పట్లో వర్షాలు పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ చెప్పకనే చెప్పినట్టయింది. సో ఇంకా మరిన్ని రోజులు ఈ ఎండల బాధ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తప్పదు అంటున్నారు నిపుణులు.