ఆ రాష్ట్రాన్ని మళ్లీ వరదలు ముంచెత్తే అవకాశం… రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

303

ఏపీ, తెలంగాణ రాష్ట్రలలో కొన్ని ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉందని పేర్కొంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇంకా సరైన వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జులై ప్రాంతంలోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా చెరువులు, జలాశయాలు నిండంటం లేదు. దీని కారణంగా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. బుధవారం తెలంగాణలోని 102 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. సరైన వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఏపీలో కూడా విశాఖ వాతావరణ శాఖా హెచ్చరిస్తుంది. రానున్న నాలుగు రోజులు అతిభారీ వర్షాలు కురవబోతున్నాయి కాబట్టి ఎవరు సముద్రంలోకి వెళ్లొద్దు అని హెచ్చరిస్తున్నారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఏపీ తెలంగాణ రాష్టాల పరిస్థితి ఇలా ఉంటె గత ఏడాది వర్షాల వలన కేరళ రాష్టం ఎంత దారుణంగా నష్టపోయిందో మనం చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చేలా ఉంది. కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా కాసర్‌గాడ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు బలపడుతున్నాయని చెప్పిన వాతావరణశాఖ.. ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్, మల్లాపురం, వాయనాడ్ ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. జూలై 19 నుంచి 22 వరకు వాయనాడ్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్రవాతావరణశాఖ. ఆ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మేరా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మల్లాపురం, కన్నూర్‌ జిల్లాల్లో జూలై 19 వరకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వెదర్ డిపార్ట్‌మెంట్ కాసర్‌గడ్‌కు జూలై 20 వరకు ప్రకటించింది. రెడ్ అలర్ట్ వాతావరణశాఖ జారీ చేసిందంటే… ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని అర్థం. అంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి పాటించాలని వాతావరణశాఖ చెబుతోంది.

Image result for heavy rains

ఇదిలా ఉంటే తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజా, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కడ్ జిల్లాలకు పసుపుపచ్చ రంగు (యెల్లో ) అలర్ట్ జారీ చేసింది. ఇక నదుల్లో నీటిస్థాయి పెరగడం, డ్యామ్‌లు నిండిపోతుండటంతో ఇడుక్కి ఎర్నాకులంలోని డ్యామ్‌గేట్లను అధికారులు ఎత్తివేశారు. నదీ తీరంలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఇక కేరళ లక్షద్వీప్‌లలోని మత్స్యకారులకు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక సుముద్రంలో వాయువ్యదిశగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన కోజికోడ్ , ఇడుక్కి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది వాతావరణ శాఖ. మల్లాపురం, త్రిసూర్, ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదురోజుల పాటు ప్రత్యేక పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరిచిన అధికారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూజా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది.