భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒకే నెలలో ఆరు సార్లు.. ఇప్పుడెంతో తెలుసా?

354

బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజే.ఆడవాళ్లకు అయితే మరి ఎక్కువగానే ఉంటుంది.అందుకే చేతిలో డబ్బు ఉంటె చాలు బంగారం కొనాలనుకుంటారు.ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు.అయితే గత కొన్నిరోజులుగా బంగారం తగ్గుతూనే ఉంది.అయితే ఈరోజు బంగారం భారీగా తగ్గింది.గత నెలరోజులుగా బంగారం తగ్గడం ఇది ఆరోసారి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ఎలా ఉందొ తెలుసుకుందామా.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు వరుసగా మూడో రోజు పడిపోయాయి. శుక్రవారం నాడు రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,300కు చేరింది.హైదరాబాద్ లో 29900 ఉంది.విజయవాడలో 29290 ఉంది.విశాఖపట్నంలో 29290 ఉంది.బెంగుళూర్ లో 28710 రూపాయలుగా రేట్ ఉంది ఈరోజు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, యూఎస్ ఫెడ్ సమావేశం, డాలర్ విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దీంతో పాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కూడా లేదు. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.175 తగ్గింది. శుక్రవారం వరుసగా మూడో రోజు రూ.250కి తగ్గింది. ఈ రోజు తగ్గుదలతో ఆరు వారాల కంటే తక్కువకు పడిపోయింది.

సెప్టెంబర్ నెలలో బంగారం 1.6% శాతం పడిపోయింది. వరుసగా ఆరో నెల నష్టపోవడం ఇదే మొదటిసారి. 1997 తర్వాత, అంటే గత 20 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా వరుస నెలలు నష్టపోతోంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పడిపోయింది. మరోవైపు, వెండి కూడా తగ్గింది. వెండి భారీగా తగ్గి రూ.38వేల మార్క్‌కు చేరుకుంది. రూ.450 తగ్గడంతో కిలో వెండి రూ.38,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేదు. దీంతో వెండి ధర భారీగా తగ్గింది. గురువారం వెండి ధర రూ.300 తగ్గింది.చూశారుగా మార్కెట్ లో బంగారం రేట్ ఎలా ఉందొ.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి తెచ్చుకోండి.మళ్ళి పెరిగిన పెరగొచ్చు..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.