కడుపులో నొప్పి అని హాస్పిటల్ కి వెళ్తే..ఆమె కడుపులో ఏమున్నాయో చూసి షాకైన డాక్టర్లు

497

మ‌నం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఏ కూర‌గాయ‌లు అయినా క‌చ్చితంగా రెండు మూడుసార్లు క‌డ‌గాలి… ఆ త‌ర్వాత మాత్ర‌మే వాటితో కూర వండాలి… కాని కొంద‌రు ఈ ప‌ని చేయ‌రు… అలాగే పెద్ద‌వాళ్లు చెప్పినా ఆ కూర‌గాయ‌ల‌ను క‌డ‌గ‌కుండా వంట చేస్తారు.. దీని వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో చేటు జ‌రుగుతుంది. ముఖ్యంగా ఇలా కూర‌గాయలు శుభ్రం చేయ‌కుండా తింటే, దానివల్ల క‌డుపులో క్రిములు ఏర్ప‌డ‌తాయి.. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వ‌స్తాయి… తాజాగా ఇలా ఓ మ‌హిళ క‌డుపు నొప్పి అని ఆస్ప‌త్రికి వెళ్లింది.. చివ‌ర‌కు ఆమెను డాక్ట‌ర్లు ప‌రిక్షించి ఆశ్చ‌ర్య‌పోయారు.. ఓసారి ఆ విష‌యాలు తెలుసుకుందాం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని చెన్నోలి అనే ప‌ట్ట‌ణంలో అహ్మ‌ద్ భార్య, నియాబేగంకు త‌ర‌చూ క‌డుపులో నొప్పి వ‌స్తోంది ….ఇక సాధార‌ణ ట్యాబ్లెట్లు వాడినా ఆమెకు క‌డుపులో నొప్పి త‌గ్గ‌డం లేదు… దీంతో భ‌ర్త అహ్మ‌ద్ ఆమెను కేజి నందా ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు.. ఆ స‌మ‌యంలో ఆమెకు మూడు నెల‌ల నుంచి ఈ నొప్పి వ‌స్తోంది అని చెప్ప‌డంతో డాక్ట‌ర్లు ముందు ఆమె క‌డుపులో స్కాన్ చేశారు.. ఇక స్కానింగ్ లో డాక్ట‌ర్లు దిమ్మ‌తిరిగే వాస్త‌వాన్ని అహ్మ‌ద్ కుటుంబానికి తెలియ‌చేశారు.. నియా బేగం క‌డుపులో 125 క్రిములు ఉన్నాయి అని తెలియ‌చేశారు… పైగా అవి వాన‌పాముల్లా 10 ఇంచులు పెరిగి కడుపులో ఉన్నాయి అని చెప్పారు.

ఇలాంటి ప‌లు కేసులు జ‌రుగుతూ ఉంటాయి అని… కాని మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే పేషెంట్ల‌కు మూడు లేదా నాలుగు క్రిములు ఉంటాయి.. అవి కూడా రెండు నుంచి మూడు ఇంచులు ఉంటాయి.. కాని ఆమె క‌డుపులో ఈ క్రిములు 10 ఇంచులు పెరిగాయి అని తెలియ‌చేశారు డాక్ట‌ర్లు.. వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా ఆనంద్ తివారి డాక్ట‌ర్ల బృందం ఆమెకు ఆప‌రేష‌న్ చేసి నియాని కాపాడారు.

ఇలాంటి ప‌రిస్దితి రావ‌డానికి కార‌ణం కూడా చెబుతున్నారు డాక్ట‌ర్లు.. మ‌నం తినే ఆహార‌పదార్ధాలు శుభ్రం చేసుకోకుండా తిన్నా, అలాగే కూర‌గాయలు స‌రిగ్గా శుభ్రంచేయ‌కుండా కూర‌లు వండినా ఇలా క్రిములు క‌డుపులో పుట్టుకువ‌స్తాయి అని తెలియ‌చేశారు.. కూర‌గాయల‌పై ఉండే ఎరువులు మ‌న శ‌రీరంలోకి నేరుగా వెళ‌తాయి.. అవి కడుపులో బ్యాక్టిరియాలుగా మార‌తాయి అని తెలియ‌చేశారు డాక్టర్లు… వేడి నీటిలో కూర‌గాయల‌ను క‌డగ‌డం వ‌ల్ల మీకు బ్యాక్టీరియాలు ఏమీ ఉండ‌వు అలాగే ఉప్పువేసి వేడినీటిలో దుంప‌లాంటి కూర‌లు శుభ్రం చేస్తే బ్యాక్టిరీయా స‌మ‌స్య ఉండ‌దు… మీరు త్రానే నీరును కూడా వేడి చేసి తాగ‌డం అల‌వాటు చేసుకోండి…