ఆమె క్యాబేజీఆకుని అక్కడ పెట్టుకుంది తర్వాత ఏమైందో తెలుసా.!

383

వయసు మీద పడుతున్నా కొద్ది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య మోకాళ్ల నొప్పులు. శరీరంలో ఏ భాగంలో బాధ వచ్చినా తట్టుకోవటం కష్టం కాదు కానీ కీళ్ల నొప్పులు అనేది చాలా మందిని వేధించే సమస్య. అయితే మారుతున్న కాలంతో పాటు కీళ్ల నొప్పులు చిన్న వయసు నుంచే మొదలవుతున్నాయి. మారిన జీవన ప్రమాణాలు,ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.అయితే వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్ లో రకరకాల మందులు, చికిత్సలు ఉన్నా.. ఇంట్లో దొరికే పదార్ధాలతో కూడా సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ నిపుణులు.క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని రుజువైంది.అదేలాగో చూద్దాం….

మొదటగా రెండు క్యాబేజీ ఆకులను తీసుకోవాలి. పైన తాజాగా ఉన్న ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత శుభ్రంగా ఆ ఆకులను కడగి,ఆరబెట్టాలి.ఆకు ఆకారం మారకుండా చాకుతో దాన్ని అడ్డంగా ముక్కలుగా కోయాలి. కోసినా ఆ ముక్కలను చపాతీల కర్రతో చపాతీలు ఆకారంలో ఆకు మెత్తపడే వరకు రుద్దాలి. రసం బయటకు వచ్చేంత వరకు రుద్దితే మంచిది.రాత్రి పడుకునే ముందు అలా ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్ తో చుట్టేయాలి. ఈ ఆకును ఒక్క మోకాళి నొప్పులకే కాదు….శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా… అక్కడ కట్టుకటుకున్నా నొప్పి మాయమవుతుంది. ఇలా రాత్రుళ్లు కట్టిన కట్టును ఉదయం తొలగించాలి. ప్రతి రోజు కొత్తగా మళ్లీ క్యాబేజీ ఆకులను తీసుకొని ఓ నెలపాటు రోజూ రాత్రి పూట ఇలా బ్యాండేజీ వేసుకుంటే మోకాళ్ల నొప్పులు సాధ్యమైనంత వరకు తగ్గుముఖం పడుతాయి.

క్యాబేజి మొకాళ్ల నొప్పులకే కాదు మరిన్ని సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్ ను తాగితే శరీరంలో ఇతర నొప్పులున్నా మెరుగైన ఫలితం ఉంటుంది. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు క్యాబేజీకి ఉండటం వల్ల….ఇవి నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి.ఇందులోని ఉండే పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్‌ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.కావాలంటే మీరు కూడా ట్రై చేసి చుడండి.