ఇంటర్నేషనల్ బీర్ డే.. బీర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

527

ప్రతి ఏడాది ఆగస్టు 3 వ తేదీన ఇంటర్నేషనల్ బీర్ డే ను సెలెబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్స్ లో అలాగే బీరు తయారీ కేంద్రాలలో ఈ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. ఈ రోజు బీర్ ప్రేమికులందరూ విపరీతంగా పండుగ చేసుకుంటారు.అయితే దాదాపు 95 శాతం మంది అబ్బాయిలు బీర్ తాగుతారు.కానీ బీర్ గురించి మీకెంత తెలుసు.ఏమి తెలియదు తాగడం తప్పా కదా.అందుకే ఇప్పుడు మీకు బీర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను.విని తెలుసుకోండి.

Image result for beer

ఇంటర్నేషనల్ బీర్ డే ను మొదటగా ఆగస్టు 2008లో సెలెబ్రేట్ చేశారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 సిటీలలో ఈ సెలెబ్రేషన్స్ జరుగుతాయి.ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ కొద్ది మొత్తంలో ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 0.05 శాతం ఉంటుంది.బీర్ ను తగిన మోతాదులో తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అయితే బీర్ వలన గుండె సమస్య వస్తుందని అంటారు.కానీ బీర్ ను తగిన మోతాదులో తీసుకోవడం వలన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.ఆల్కహాల్ బెవెరేజెస్ ను తీసుకోవడం వలన వెయిట్ గెయిన్ సమస్య తలెత్తవచ్చు.ముఖ్యంగా బీర్ వలన పొట్ట పెరుగుతుందన్న భావన ఉంది. అయితే, ఈ విషయంపై సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.

Related image

బీర్ లో ఆల్కహాల్ నుంచే రెండు వంతుల కేలరీస్ అలాగే కార్బోహైడ్రేట్స్ నుంచి ఒక మూడో వంతు కేలరీస్ అందుతాయి.బీర్ ను తగిన మోతాదులో తీసుకుంటే అంటే రోజుకు 24 గ్రాములు తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ సమస్య బారిన పడే ప్రమాదం దాదాపు 30 శాతం తగ్గుతుంది.బీర్ లో విటమిన్స్, మినరల్స్, పోలీఫెనాల్స్ మరియు ఫైబర్ వంటి పోషక విలువలు లభిస్తాయి. అలాగే థయామిన్, నియాసిన్, రైబో ఫ్లేవిన్, పాంటోతేనిక్ యాసిడ్, పైరీడోక్సిన్ మరియు కొబలమిన్ వంటి విటమిన్స్ లభిస్తాయి. అలాగే, కేల్షియం, కాపర్, ఐరన్, పొటాషియం, సిలికాన్, సోడియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ లభిస్తాయి.

ఇప్పుడు బీర్ లోని వెరైటీస్ గురించి తెలుసుకుందాం

1. లాగర్ బీర్ అనేది బాటమ్ ఫెర్మెంటింగ్ ఈస్ట్ లో తయారుచేస్తారు. ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ బీర్ టేస్ట్ లైట్ గా ఉంటుంది అలాగే మల్టీగా ఉంటుంది.
2. ఇండియా పేల్ ఎల్స్ (IPA) అనేది టేస్ట్ లో కొంచెం చేదుగా ఉంటుంది. అలాగే ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సిట్రస్ ఫ్లేవర్ తో ఘాటుగా అలాగే చేదుగా ఉంటుంది.
3. పిల్సనర్ అనేది న్యూట్రల్ మరియు హార్డ్ వాటర్ తో తయారుచేయబడినది. ఇది గోల్డెన్ కలర్ లో డ్రైగా, క్రిస్పీగా అలాగే చేదు ఫ్లేవర్ లో ఉంటుంది.
4. స్టౌట్ బీర్స్ డార్క్ గా రోస్టెడ్ మాల్ట్ తో క్రాఫ్ట్ చేయబడి ఉంటాయి.
5. పోర్టార్ బీర్స్ అనేవి డార్క్ కలర్ లో ఉంటాయి. ఇందులో వాడే చాకొలేట్ అలాగే డార్క్ రోస్టెడ్ మాల్ట్స్ వలన బీర్ ఈ కలర్ లోకి మారుతుంది.
6. బెల్జియన్ స్టయిల్ బేర్స్ అనేవి స్వీట్, ఫ్రూటీ అలాగే స్పైసీ ఫ్లేవర్స్ లో ఉంటాయి. వీటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చేదు తక్కువగా ఉంటుంది.
7. వీట్ బేర్స్ అనేవి వీట్ తో తయారవుతాయి. అందువలన, ఈ బెవెరేజ్ లైట్ కలర్ లో ఉంటుంది. ఆల్కహాల్ కంటెంట్ అవేరేజ్ గా ఉంటుంది. దీన్ని సమ్మర్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.
8. చెర్రీ, రాస్ప్ బెర్రీ లేదా పీచ్ తో సోర్ బీర్ ను తయారుచేస్తారు. ఫ్లేవర్ అనేది స్వీట్ గా అలాగే సోర్ గా ఉంటుంది.

ఇవేనండి బీర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.మరి మేము చెప్పిన ఈ విషయాల మీద అలాగే బీర్ వలన కలిగే లాభాల మీద అలాగే నష్టాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

టీడీపీలో స‌ర్వే ఎఫెక్ట్ అందుకే జంపింగ్