ఒకే కండోమ్ ను కడిగి ఐదుసార్లు సెక్స్ చేశాడు.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్..

420

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు. లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే మీరెప్పుడైనా వాడిన కండోమ్ ను మళ్ళి వాడారా.. ఒకే కండోమ్ తో నాలుగైదు సార్లు సెక్స్ చేశారా. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా..ఇలా చేసిన ఒక వ్యక్తి తన సమస్యను మాకు చెప్పాడు. మరి అతని సమస్య ఏమిటో దానికి మేము ఇస్తున్న సొల్యూషన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Image result for condam washing

నా పేరు రమేష్. నాకు పెళ్లయి రెండు నెలలు అవుతుంది. కానీ నేను, నా భార్య ఇప్పుడే పిల్లలు వద్దకుంటున్నాం. దీంతో నేను కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తున్నాను. అయితే ఒక్కోసారి నేను కండోమ్స్ ప్యాకెట్స్ తీసుకురావడం మరిచిపోతున్నాను. ఆ సందర్భంలో నేను అంతకు ముందు ఉపయోగించిన కండోమ్ ను మళ్లీ కడిగి ఉపయోగిస్తున్నాను. ఈ విషయం మొదట నా భార్యకు తెలియదు.ఒక రోజు నేను బాత్రూమ్ లో కండోమ్ లో ఉన్న వీర్యాన్ని కిందకు జల్లి క్లీన్ చేస్తుంటే నా భార్య చూసింది. చాలా కోప్పడింది. కండోమ్ కూడా కొనలేని వాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటూ మండిపడింది. నేను అప్పుడప్పుడు హడావిడిలో ఉండి కండోమ్స్ కొనడం మరిచిపోతుంటాను. వాస్తవానికి నాకు మెడికల్ స్టోర్స్ దగ్గరకు వెళ్లి కండోమ్స్ ప్యాకెట్స్ కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కండోమ్ ప్యాకెట్ అడగగానే పక్కనే ఉన్న కస్టమర్స్ తో పాటు కండోమ్ ప్యాకెట్ ఇచ్చే అతను కూడా వింతగా చూస్తారు. ఆ అవమానం భరించలేక నేను వాడిన కండోమ్స్ నే మళ్లీ మళ్లీ వాడుతున్నాను. నా భార్యతో నేను ఆదివారం రోజు 3 నుంచి ఐదుసార్లు సెక్సులో పాల్గొంటున్నా. సెక్సు మాత్రం కండోమ్ వేసుకుని చేస్తుంటాను. అయితే నాలుగుసార్లు చేసిన ఐదుసార్లు చేసినా నేను ఒకటే కండోమ్ ఉపయోగిస్తుంటాను. అయినా ప్రతి సారి నేను కండోమ్ ఉపయోగిస్తున్నా కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం. నేను ఎలాంటి తప్పు చేయడం లేదని అనుకుంటున్నాను. కండోమ్ ను ఎలా ఉపయోగించాలి… అలాగే మంచి కండోమ్ లు గురించి చెప్పండి.

Image result for condam washing

సమాధానం : మీరు పిల్లలు ఇప్పుడే పుట్టకూడదనే ఉద్దేశంతో కండోమ్ ఉపయోగిస్తున్నారు. అయితే సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ కొత్త కండోమ్ వేసుకుని చేస్తే మంచిది. అలా కాకుండా వాడిన కండోమ్ ను మళ్లీ శుభ్రం చేసుకుని ఉపయోగించడం మంచిది కాదు. అది సురక్షితమైన సెక్సు కిందకు రాదు. ప్రతి కండోమ్ కూడా మళ్లీ వినియోగానికి పనికిరాదు. ఒకసారి వాడిన కండోమ్ ను తిరిగి మరల వాడటం చాలా ప్రమాదం కూడా. మీరు అలా ఒకే కండోమ్ ను లెక్కలేనన్నీ సార్లు ఉపయోగిస్తే పిల్లలు వద్దనుకున్నా పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు మీరు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఉపయోగించిన కండోమ్ తిరిగి మరోసారి ఉపయోగిస్తే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.గర్భాన్ని నిరోధించేందుకు సురక్షిత సెక్స్ కోసం మనం కండోమ్ ఉపయోగిస్తాం. మనకు వందలాది కండోములు మార్కెట్లో లభిస్తాయి. ఒక్కొక్కరు ఆసక్తి బట్టీ ఒక్కోవిధమైన బ్రాండ్ కండోమ్ ఉపయోగిస్తుంటారు. లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. కండోమ్ వాడకం కూడా అంత కష్టమేమీ కాదు. అయితే దీనిని వాడే సమయంలో ఎలాంటి తొడుగులను, ఇతర ముక్కలను వాడకూడదు. మీరు మెడికల్ స్టోర్స్ వెళ్లి కండోమ్స్ కొనలాంటే ఇబ్బందిగా ఉంటే ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు.కండోమ్ ను కూడా మీరు జాగ్రత్తగా వాడండి. మొదటగా కండోమ్ ప్యాక్ ను విప్పి దానిని బయటకు తీసి చెక్ చేయాలి.

ఈ క్రింది వీడియో చూడండి 

ఒక్కోసారి కండోమ్ తయారీలో లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది. కండోమ్ కు ఏమైనా రంధ్రాలున్నాయోమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రంధ్రాలుంటే అలాంటి కండోమ్స్ ఉపయోగించకండి. అంతేకాకుండా కండోమ్ పొడిగా ఉంటే కూడా ఉపయోగించకండి. పురుషాంగానికి కండోమ్ తొడిగే సమయంలో జాగ్రత్త వహించాలి. తొడిగించే సమయంలో కండోమ్ మొదటి కొనను పట్టుకుని అంగానికి ఎక్కించుకోవాలి. సెక్స్ పూర్తి అయ్యాక వీర్యం అందులోనే ఉండేలా కండోమ్ కొన భాగంలో కాస్త ఖాళీ స్థలాన్ని వదలాలి. సెక్స్ పూర్తయ్యాక యోని నుంచి పురుషాంగాన్ని బయటకి తీసే సమయంలో కండోమ్ లోని వీర్యం జారి పడకుండా కండోమ్ ను గట్టిగా పట్టుకోవాలి. వీర్యం విడుదలైన తర్వాత యోని నుంచి అంగాన్ని బయటకు తీసి పురుషాంగం నుంచి కండోమ్ ను వేరు చేసి వెంటనే తొలగించాలి. అంతేకాని దాన్ని మళ్లీ తిరిగి వాడకూడదు. సెక్స్ పూర్తయ్యాక మీ అంగాన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. కొందరు సెక్స్ మొత్తం కండోమ్ లేకుండా చేసి వీర్యం స్కలించేటప్పుడు కండోమ్ వేసుకుంటారు. ఇది కూడా చాలా తప్పు. కాబట్టి కండోమ్ ను వాడేటప్పుడు ఇవన్నీ పాటించండి. విన్నారుగా కాబట్టి మీకు కూడా కండోమ్ ను కడిగి వాడే అలవాటు ఉంటె వెంటనే మానుకోండి. లేకపోతే నష్టపోయేది మీరే. మరి కండోమ్ గురించి ఎక్కువసార్లు యూజ్ చేస్తే వచ్చే నష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.