టాయిలెట్ అనుకొని విమానం తలుపు దగ్గరికెళ్లి ఓపెన్ చేశాడు చివ‌ర‌కు ఎంత దారుణం జ‌రిగిందో తెలిస్తే షాక్

413

విమానాల్లో ప్ర‌యాణం అంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే అంటే ఇబ్బంది ఉంటుంది.. ముఖ్యంగా విమాన ప్ర‌యాణాలు గాల్లో దీపాలు లాంటివి అంటారు, కాని టెక్నిక‌ల్ అంశాలు ఎంత జాగ్ర‌త్తలు తీసుకున్నా ప‌లు ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉంటాయి.. ఒక్కోసారి క్రూ త‌ప్పిదం ఉంటే మ‌రికొన్ని సార్లు పైల‌ట్ త‌ప్పిదం ఉంటుంది.. ఇక ప్ర‌యాణికులు క‌చ్చితంగా ప్రీ ప్లాన్ గా, ఏమైనా చేయాలి అని చేస్తే అవి ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతాయి.. ఇక తాజాగా ఇలాంటి ఓ పెను ప్ర‌మాదం నుంచి విమానం త‌ప్పించుకుంది. అంతేకాదు వంద‌ల మంది ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇది కావాల‌ని జ‌రిగిందా లేదా అనుకోకుండా జ‌రిగిందా అని ఎయిర్ వేస్ సిబ్బంది పోలీసులు ఇంట‌రాగేష‌న్ చేస్తున్నారు. అస‌లు విష‌యంలోకి వెళితే.

అప్పటికే విమానం భూమికి ఆకాశానికి మధ్యలో ప్రయాణిస్తుంది. ఇంతలో ఓ ప్రయాణికుడు టాయిలెట్ అనుకొని విమానం తలుపు తీయబోయాడు. అతడిని గమనించిన విమానం సిబ్బంది, వెంటనే అతడిని పట్టుకొని నిలువరించారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. విమానం బిహార్‌లోని పాట్నా విమానాశ్రయంలో దిగిన త‌ర్వాత‌ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు ఆ వ్య‌క్తిని అప్పగించారు.

న్యూఢిల్లీ నుంచి బీహార్ రాజధాని పాట్నాకు గోఎయిర్ విమానం బయల్దేరింది. అర్థరాత్రి కావడంతో అందరూ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లడానికి లేచాడు. అయితే టాయిలెట్ డోర్ అనుకొని విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి విమాన సిబ్బంది అతడిని నిలువరించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి మొదటిసారి విమానం ఎక్కడంతో ఏది ఎక్కడుందో తెలిసుండదని, పైగా నిద్ర మత్తులో ఉండడంతో విమానం తలుపునే టాయిలెట్ అనుకుని ఉంటాడని సిబ్బంది తెలిపారు, మరో ప‌క్క ఇది నిజ‌మా కాదా అని కూడా ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆరా తీస్తున్నారు.. అలాగే అత‌ను గ‌తంలో ఎటువంటి విమాన ప్ర‌యాణాలు చేశాడా లేదా అని తెలుసుకుంటున్నారు, స‌ద‌రు వ్య‌క్తి మాత్రం త‌న‌కు నిజంగా తెలియ‌క ఆ డోర్ ని తీయ‌డానికి ప్ర‌య‌త్నించాను అని చెప్పాడు.. అయితే సెంట్ర‌ల్ లాకింగ్ సిస్టం ఉండ‌టం వ‌ల్ల అది తెరుచుకోదు అని, కాని ఇలా చ‌ర్య‌ల‌కు దిగ‌డం కూడా స‌రైన‌ది కాదు అని చెబుతున్నారు. మొత్తానికి అత‌ని అత్యుత్సాహం ఇప్పుడు అత‌నికి రెండు రోజులుగా విచార‌ణ‌కు కూర్చొబెట్టింది…విమాన సిబ్బందిని అడిగితే ఈ స‌మ‌స్య పోయేది క‌దా అని కొంద‌రు అత‌నికి స‌ల‌హా ఇస్తున్నారు.