రక్తం అమ్మి…మద్యం తాగిన యువకుడు త‌ర్వాత ఏమైందో తెలిస్తే మందుఎప్పుడూ తాగ‌రు

295

ఎవ‌రికి అయినా ఎప్పుడైనా ఎమ‌ర్జ‌న్సీ స‌మ‌యంలో రక్తం అవ‌స‌రం అంటే ఇస్తాం, ఇక రేర్ బ్ల‌డ్ గ్రూపు అంటే ముందు ఇవ్వ‌డానికి రెడీ అవుతాం. తాజాగా ఓ వ్య‌క్తి ర‌క్తం అమ్మి త‌న ప్రాణాలమీద‌కు తెచ్చుకున్నాడు…ఆసుపత్రిలో రక్తం అమ్మి… పీకల దాకా మద్యం తాగిన ఓ యువకుడు నైట్ షెల్టరులో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. అలీఘడ్ నగరానికి చెందిన జగదీష్ అనే యువకుడు రెయిన్ బసేరా ప్రాంతంలోని మున్సిపల్ కార్పొరేషన్ నైట్ షెల్టరులో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జగదీష్ రాత్రి నైట్ షెల్టరుకు వచ్చి పడుకొని ఉదయంకల్లా శవమయ్యాడు. జగదీష్ ఆసుపత్రిలో రక్తం అమ్మి, మద్యం తాగి వచ్చాడని నైట్ షెల్టరుకు చెందిన చాంద్ ముహమ్మద్ చెప్పాడు. జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శవపరీక్ష నివేదికలో జగదీష్ మృతికి కారణం తెలుస్తుందని అలీఘడ్ మున్సిపాలిటీ పీఆర్వో సభాపతియాదవ్ చెప్పారు. మొత్తానికి ర‌క్తం అధిక మోతాదులో ఎవ‌రికో అవ‌స‌రం అవ‌డం వ‌ల్ల ఇవ్వ‌డం జ‌రిగింది అని తెలుస్తోంది.. ఇలా ఇచ్చిన త‌ర్వాత త‌న ప్రాణాలు కోల్పోయి ఉంటాడు అని చెబుతున్నారు.ఇక అత‌నికి కుటుంబం ఉందా లేదా అనే విష‌యాలు కూడా ప‌రిశీలిస్తున్నారు.. అత‌ను రాత్రి రక్తం ఇచ్చిన వెంటనే అక్క‌డ నుంచి డ‌బ్బులు తీసుకుని పూటుగా మ‌ధ్యం తాగాడు అని, ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆల్కాహల్ శాతం మ‌రింత పెరిగి ఉంటుంది అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.. ఇక అత‌నికి ఏమైనా గుండె పోటు లాంటిది వ‌చ్చిందా అనే కోణంలో కూడా డాక్ట‌ర్లు ప‌రిశీల‌న చేయ‌నున్నారు. మ‌రి చూశారుగా ఒక‌రికి సాయం చేయ‌డం ఆ సాయం నుంచి డ‌బ్బు పొందండం, దానితో త‌న ఆరోగ్యం చెడ‌గొట్టుకుని ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు అంటున్నారు అక్క‌డ వారు.. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియ‌చేయండి.