అతను తన గర్ల్ఫ్రెండ్ను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు

304

ఈ ప్ర‌పంచంలో ప్రేమ ఎంతో అద్బుత‌మైన‌ది ప్రేమికులు ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండ‌లేరు అనేది తెలిసిందే… ఇక‌ప్రియురాలు కూడా త‌న‌ని ప్రియుడు ఎంతో ప్రేమించాలి అని అనుకుంటుంది. .. తనను బాగా చూసుకోవాలని వారు భావిస్తారు. తన మాటలకు విలువ ఇవ్వాలని, తన అభిప్రాయాలను గౌరవించాలని, తనకు స్వేచ్ఛ ఇవ్వాలని వారు కోరుకుంటారు. అంతేకానీ.. ప్రియుళ్లు ఎవరూ కూడా తమ ప్రియురాళ్లను ఇబ్బంది పెట్టాలని అనుకోరు కదా… అయితే ఆ వ్యక్తి కూడా తన ప్రియురాలిని దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినంత పనిచేశాడు.. కానీ చివరకు కథ సుఖాంతం అయింది. అతను చేసింది జోక్ అని తెలియడంతో ఆ ప్రియురాలు లైట్ తీసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

Image result for lovers

డేల్ లీక్స్-, కెల్లీ గ్రీవ్స్ గ‌త సంవత్సరం నుంచి డేటింగ్ చేస్తున్నారు. డేల్‌కు ఒక ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్ కంపెనీ కూడా ఉంది. అయితే డేల్ తన ప్రియురాలు కెల్లీపై జోక్ చేశాడు. అది ఏమిటో తెలుసా..? ఆమెను ఈబే అనే ఈ-కామర్స్ సైట్‌లో వేలంలో అమ్మకానికి పెట్టాడు. అది కూడా పార్ట్‌లుగా అమ్ముతానని, కొన్ని పనిచేయకపోవచ్చని ఆ సైట్‌లో సమాచారం పోస్ట్ చేశాడు. దీంతో ఆమె శరీర భాగాలకు గరిష్టంగా 70వేల పౌండ్ల (దాదాపుగా రూ.68 లక్షలు) బిడ్ వచ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే డేల్ చేసిన ఈ ప్రకటనపై చాలా మంది స్పందించారు. కెల్లీ అంతకు ముందు ఎవరితో అయినా డేటింగ్‌లో ఉందా ? ఉంటే వారెవరు ? ఆమెకు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా ? తదితర వివరాలను వేలంలో పాల్గొన్నవారు అడిగారు. ఇక కొందరు డేల్ స్నేహితులకే ఈ విషయం తెలియడంతో వారు మొదట ఆశ్చర్యపోయారు. అయినా కెల్లీ శరీర భాగాలను కొంటామని అన్నారు. అయితే ఈబే సైట్ నిబంధనల ప్రకారం.. అందులో మనిషి అవయవాల అమ్మకం, కొనుగోలు వంటి వివరాలు పెట్టకూడదు. దీంతో డేల్ పెట్టిన పోస్టును 24 గంటల్లోనే వారు తొలగించారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున బిడ్డింగ్ వచ్చింది. కాగా సైట్‌లో ఆ సమాచారం పోస్ట్ చేసిన కొంత సేపటికే అది వైరల్ అయింది. దీంతో ఆ పోస్ట్‌కు ఏకంగా 24 గంటల్లో 8100 వ్యూస్ వచ్చాయి. ఇక ఆ పోస్ట్ గురించి కెల్లీకి కూడా తెలిసింది. అయితే అదంతా జోక్ అని తెలియడంతో ఆమె లైట్ తీసుకుంది. ఏది ఏమైనా.. డేల్ ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆన్‌లైన్‌లో పార్ట్‌లు పార్ట్‌లుగా అమ్మకానికి పెట్టిన వార్త మాత్రం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. మ‌రిఅత‌ను చేసిన ప‌నిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.