భార్యను వదిలించుకోవడానికి ప్లాన్ వేశాడు కానీ దేవుడు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాడు

1116

రోజురోజుకు సమాజంలో ఆడవాళ్ళమీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. ఏ మూల చూసిన ఇవే వార్తలు వినిపిస్తున్నాయి.. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలపై మృగాలగా ప్రవర్తిస్తున్నారు.. అన్ని తెలిసి, చదువుకున్న వారు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం దౌర్బాగ్యం అని చెప్పుకోవచ్చు.. ఐతే ఇక్కడ ఆమె భర్తే చంపడానికి చూసారు .. ఇందుకు మంచి ప్లాన్ వేసేడు .. కానీ దేవుడికి ఇది ఏమత్రం ఇష్టం లేదనుకుంటా ఆ ప్లాన్ బెడిసి కొట్టి చివరకు తానే ప్రాణాలు వదిలేసాడు.

ఈ క్రింది వీడియో చూడండి.

ఇంతకు ఎవరు ? ఏంటి ? అనే విషయం పై పూర్తి వివరాలు తెలుకుందాం.పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్వర్ మసీహ్ కోమల్ అనే అమ్మాయిని 2010లో వివాహం చేసున్నాడు.పచ్చగా సాగుతున్న వీరి సంసారం లోకి అనుమానం అనే పెనుభూతం వచ్చింది అన్వర్ కి దాంతో కోమల్ కి మద్య చిన్న చిన్న గొడవలు మొదలైయాయి .. అవి ఎంతకు ఆగక .. భార్యను చంపేవరకు వెళ్ళాయి.

Image result for bride and bridegroom

ఇందుకు అన్వర్ తన తమ్ముడు నాచ్ తార్ తో చెప్పడం తో అతని సహాయం తో ఆమె చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.. ఆమెను చంపి భార్యకు ఈత రాకపోవడంతో నీళ్ళలో మునిగి చనిపోయిందని అందరినీ నమ్మించాలని ప్లాన్ వేసుకున్నాడు..

Image result for murder scene
ప్లాన్ ప్రకారం .. అనుకున్నట్లుగానే భార్య, తమ్ముడితో కలసి ఆ రోజు సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉన్న కాలువ వద్దకు అన్వర్ వెళ్లాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలసి ఆమెను కాలువలోకి తోసేశారు. అప్రమత్తమైన ఆమె… కాలువలో పడకుండా చెట్టును గట్టిగా పట్టుకుంది.

Image result for crime on women
ఐతే వెంటనే అన్వర్ నీటిలోకి దూకి .. ఆమెను చెట్టు మీద నుండి కిందకు లాగే ప్రయత్నం చేశాడు. కానీ నీటి ఒత్తిడి ఎక్కువ అవ్వడం తో అన్వర్ భార్య కళ్ళ ముందే కొట్టుకుపోయాడు.

Image result for crime on women

ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న అన్వర్ తమ్ముడు నాచ్ తార్ భయంతో పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. అన్వర్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందంటే ఇదేనేమో.. అనుమానం తో ఇలా తన ప్రాణాలను పోగొట్టు కున్నాడు.