ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని చివ‌ర‌కు ఆమెని చ‌చ్చిపోయేలా చేశాడు ప్రియుడు

295

అప్పుడే యవ్వనంలో కాలుపెట్టి అందమైన ఊహాలోకంలో తిరుగుతుంటారు యువతీయువకులు. అలాంటి అమాయక వయసులో కొందరు దారి మళ్లించి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. తాజాగా కాలేజీలో చదువుకుంటూ వున్న ఓ యువతికి గాలం వేసాడో యువకుడు. ప్రేమ అంటూ ఆమెకి తీపి కబుర్లు చెప్పాడు. ఆమె అతడిని గుడ్డిగా నమ్మేసింది. అంతే… ఆమె జీవితం అంతమైంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్ని జ‌రుగుతున్నా స‌మాజంలో అనేక ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా కొంద‌రు అమ్మాయిల్లో మార్పు రావ‌డం లేదు చాలా మంద ఇటువంటి దారుణ‌మైన మోసాల ఊబిలో చిక్కుకుని లైంగిక దాడికే కాదు జీవితాల‌ను కూడా పోగొట్టుకుంటున్నారు.

Image result for LOVERS

వేలూరికి చెందిన వేలు అనే యువకుడు, కడలూరికి చెందిన ఇళవరసిని ప్రేమలో దింపాడు. ఆమె వెంట పడుతూ నీవు లేనిదే నేను బ్రతకలేను అంటూ కబుర్లు చెప్పాడు. ఆమె అతడి మాటలు నమ్మేసింది. అయితే ఆమె కాలేజీ చదువు ముగిసేవరకూ ప్రేమ అంటూ ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే వున్నాడు. చదువు ముగుస్తుందనగానే ఆమెకి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు ఆమెను తనతో వచ్చేయమన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతడి మాటలు నమ్మి వెళ్లింది ఆమె. కొన్నాళ్లు మధురవాయిల్ ప్రాంతంలో ఓ ఇల్లును అద్దెకి తీసుకుని భార్యాభర్తలమంటూ చేరారు. అలా కొన్నాళ్లు గడిచాక ఆమె ముందు అసలు నిజం చెప్పాడు. తనకు పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలున్నారని వెల్లడించాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటానని చెప్పడంతో పాటు, ఈ విషయం బయటకు తెలిస్తే మనల్ని చంపేస్తారనీ, అంతకంటే మనమే చచ్చిపోవడం మంచిదంటూ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించడం ప్రారంభించాడు. అతడిచ్చిన షాక్‌కి అటు కన్నవారి ఇంటి గడప తొక్కలేక… ఇటు పెళ్లయినవాడితో వుండలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా ఆమె చ‌నిపోవ‌డానికి కార‌ణం అయ్యి ఏమీ తెలియ‌ని క‌బుర్లు చెప్పాడు కాని పోలీసులు విచార‌ణ‌లో తాను దీనికి కార‌ణం అని ఒప్పుకున్నాడు చూశారుగా ఇలాంటి వారిని ఎట్టి ప‌రిస్దితుల్లో న‌మ్మ‌కండి. మ‌రి ప్ర‌తీ అమ్మాయి ఇక నైనా ప్రేమ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలియ‌చేస్తున్నాం.