మీ ఇంట్లో కుక్క ఉందా..అయితే జాగ్రత్త..ఈ వ్యక్తికి కుక్క వలన ఎంతటి ఘోరం జరిగిందో తెలిస్తే షాక్..

578

మీ ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా..? వాటితో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారా..? అయితే జాగ్రత్త.జాగ్రత్త ఎందుకు అనుకుంటున్నారా..కుక్కలకు యజమానులపై ప్రేమ ఎక్కువైతే వాటి మూతితో నాలుకతో మన శరీరాన్ని ముద్దాడుతాయి. అందులో కుక్కకు ఉన్న విశ్వాసం , ప్రేమ మాత్రమే మనకు తెలుసు కానీ ఆ ప్రేమ వెనక ఉన్న విషం మనం గ్రహించము. అదే ఆ కుక్కకు ఉన్న బ్యాక్టీరియా. ఇదే విషయాన్ని అమెరికా వైద్యులు బయటపెట్టారు.మరి వారు బయటపెట్టిన ఒక విషయం గురించి ఇప్పుడు మీకు చెప్తాను.విని తెలుసుకోండి.

Image result for playing with pet dog

అమెరికాలో వైద్యులు ఓ విచిత్రమైన కేసును చూశారు. గ్రెగ్ అనే పెయింటర్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరాడు. ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాప్తి చెందకముందే ఆయన కాళ్లను డాక్టర్లు తీసేశారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్‌ ఎలా సోకిందో వివరించారు. గ్రెగ్‌కు ఓ పెంపుడు కుక్క ఉండేది. ఆ కుక్కతో చాలా సన్నిహితంగా ఉండేవాడు గ్రెగ్. అయితే అంతే ఆప్యాయత చూపించే ఆ కుక్క గ్రెగ్‌ను ఎప్పుడూ తన మూతితో నాలుకతో ముద్దాడేది. కుక్క ప్రేమను చూసి గ్రెగ్ మురిసిపోయేవాడు.ఇదే అతను చేసిన తప్పు.తప్పేంటి అనుకుంటున్నారా.ఆ కుక్క అతడిని నాకడం వల్ల దానికున్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా గ్రెగ్‌కు సోకింది.

Image result for playing with pet dog

గ్రెగ్‌కు సోకిన బ్యాక్టీరియా పేరు క్యాప్‌నోసైటోఫాగా కానిమోర్సస్ అని డాక్టర్లు వెల్లడించారు. అది సాధారణంగా కుక్కలు, పిల్లుల్లో ఉంటుందని వివరించారు. దీంతో సాధారణంగా మనుషులకు ఎలాంటి అపాయమూ ఉండదు కానీ కొన్ని అరుదైన సంఘటనల్లో ఈ కుక్కలు పిల్లుల నుంచి వచ్చే బ్యాక్టీరియా మనుషుల రక్తాన్ని విషం చేయగలదని వైద్యులు తెలిపారు. కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఇప్పుడు ఆ కుక్క గ్రేస్ ను నాకడంతో దాన్నుంచి విడుదలైన బ్యాక్టీరియా గ్రెగ్‌ను తాకింది. ముందుగా జ్వరంతో బాధపడ్డాడు, ఆ తర్వాత వాంతులయ్యాయి. ఇక కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.గ్రేస్ శరీరంపై చిన్న చిన్న గాయాలు కూడా వచ్చాయి.ఈ గాయాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని అంతకుముందు లేవని డాక్టర్లకు తెలిపాడు..గ్రెగ్ శరీరంపై కనిపించిన గాయాలు చిన్నపాటి గడ్డలని డాక్టర్లు తెలిపారు. శరీరంలో రక్త ప్రసరణను ఇవి అడ్డుకుంటాయని చెప్పారు. దీంతో శరీరంలోని కణజాలాలు మరియు కండరాలు పూర్తిగా దెబ్బతింటాయని వివరించారు.ఈ బ్యాక్టీరియా శరీరం మొత్తం పాకకుండా ఉండాలని అతని కాళ్లు, చేతులు తీసేశారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన షాక్‌కు గురిచేసింది.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఒక కుక్క ఇంత పని చేసింది అంటే ఆశ్చర్యకరంగా ఉంది కదూ.కాబట్టి కుక్కలతో కొంచెం జాగ్రత్త.లేకుంటే మీకు కూడా ఇలాంటి పరిస్థితే రావొచ్చు.మరి ఈ ఘటన గురించి అలాగే పెంపుడు కుక్కల వలన మనకు కలిగే నష్టాలూ,ఇలాంటి రోగాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.