తన కామ కోరిక తీర్చలేదని మోడల్ ని ఏం చేశాడో తెలిస్తే షాక్

440

అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది.. ప్రేమ‌ని అంగీక‌రించ‌క‌పోతే చంప‌డానికి కూడా రెడీ అవుతున్నారు కొంద‌రు క‌సాయిలు..త‌న పశువాంఛను తీర్చమని బలవంతపెడితే నిరాకరించిందన్న కోపంతోనే వర్ధమాన మోడల్‌ మన్సీ దీక్షిత్‌ ను ఓ ఫొటోగ్రాఫర్‌ అమానుషంగా హతమార్చాడు. ముంబయిలో కొద్ది నెలల క్రితం మన్సీ దీక్షిత్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహాన్ని ఓ ఫుట్‌పాత్‌ వద్ద సంచిలో పోలీసులు కనుగొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విచారణ సందర్భంగా నిందితుడు సయ్యద్‌ ముజమ్మిల్‌ దారుణ వాస్తవాలను బయటపెట్టాడు.

Image result for lovers

ఈమేరకు బంగుర్‌నగర్‌ పోలీసులు తాజాగా అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నిందితుడు తెలిపిన విషయాలను పోలీసులు వెల్లడించారు. గత అక్టోబరు 15న నిందితుడు తన ఇంటివద్దే ఆమెను హతమార్చాడు. గొప్ప మోడల్‌ కావాలని కలలు గన్న మన్సీ దీక్షిత్‌తో ఫొటోగ్రాఫర్‌ సయ్యద్‌కు అంతకు కొద్ది రోజుల ముందే పరిచయం అయింది. ఆమెను లోబరచుకోవాలన్న దురుద్దేశంతోనే ఫొటోలు తీసేందుకని ఇంటికి పిలిపించుకున్న అతను తన పశువాంఛను బయటపెట్టాడు. ఆమె నిరాకరించడంతో ఓ స్టూలుతో తలపై కొట్టాడు. ఆమెపై దాడి చేసి, మెడకు లేసు, తాడు బిగించి హతమార్చాడు. అనంతరం ఓ సంచిలో మృతదేహాన్ని కట్టేసి క్యాబ్‌లో తీసుకెళ్లి ఓ ఫుట్‌పాత్‌ వద్ద వదిలి వెళ్లిపోయాడు. సంచిలో మృతదేహాన్ని గమనించిన క్యాబ్ డ్రైవ‌ర్ పోలీసులకు సమాచారం అందించారు. ముజమ్మిల్‌ను అతని అపార్టుమెంటు వద్దే పోలీసులు అరెస్టు చేశారు. త‌మ బంధువొకరు అనారోగ్యంతో బాధ పడుతుండటంతో ఈ ఘటన జరిగే ముందురోజే నిందితుడు హైదరాబాద్‌ నుంచి ముంబయి వచ్చినట్లు అతని కుటుంబ సభ్యులు అప్పట్లో తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ ఆ సంచిలో మృతదేహం వుందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాడు దీంతో అత‌న్ని సులువుగా ప‌ట్టుకున్నారు పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముజమ్మిల్‌ను అరెస్ట్ చేశారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జీషీట్ దాఖలు చేశారు.ఆ అమ్మాయి మోడల్ గా ఎదిగి పేరు సంపాదించుకోవాలని భావించింది కాని ఇత‌ని ప‌శువాంచ ఆమెని బ‌లితీసుకుంది అంటున్నారు కుటుంబ స‌భ్యులు.