తల్లి మరణం.. ఇంటిని శుభ్రం చేస్తున్న కొడుకు.. ఫ్రిడ్జ్‌ను ఓపెన్ చేసి చూస్తే…

376

ఒక తల్లి, ఒక కొడుకు. తల్లి ఎప్పుడు చూసినా ఒక బాక్సుతోనే ఉండేది. అందులో ఏముందని అడిగితే సమాధానం చెప్పేది కాదు. ఆ బాక్సును ఎప్పుడు ఫ్రిజ్‌లోని ఉంచేది. ఓ రోజు ఆమె అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో ఆమె కొడుకు ఇంటిని శుభ్రం చేయడంలో భాగంగా ఫ్రిజ్‌ను తెరిచాడు. అందులో అమ్మ ఇష్టపడే బాక్సు ఉంది. ఆ బాక్సులో ఏదో విలువైన వస్తువు ఉంటుందని తెరిచి చూశాడు. కానీ, అందులో శిశువు మృత దేహాం ఉంది. మరి ఆ మృతదేహం ఎవరిదీ..ఇన్ని రోజులు ఆ తల్లి ఎందుకు దాచిపెట్టింది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

అమెరికాలోని మిస్సోరీలో నివసిస్తున్న ఆడమ్ స్మిత్(37) అనే వ్యక్తి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో జూలై 21న చనిపోయింది. గత 20 ఏళ్లుగా ఆమె సెయింట్ లూయిస్‌లోని ఇంట్లోనే నివాసముంది. అయితే తల్లి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో బాగోగులు చూసుకోవడానికి స్మిత్ సెయింట్ లూయిస్ వెళ్లాడు. అయితే, తల్లి వద్ద స్మిత్‌కు చిన్నప్పటి నుంచి ఓ బాక్సు ఫ్రీజ్‌లో దాచి పెట్టి ఉంచడం కనిపించింది. తల్లి బతికినన్ని రోజులు ఆమెతోనే ఉందా బాక్స్. దాదాపు 37 ఏళ్లుగా ఆ బాక్సును తనతోనే భద్రంగా దాచి పెట్టుకుంటూ వచ్చిందామె. స్మిత్‌తో కూడా ఎప్పుడు అందులో ఏముందో చెప్పలేదు. ఇక జూలై 21న తల్లి చనిపోవడంతో అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇంటిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు స్మిత్. ఇంతలో అతడికి గత నాలుగు దశాబ్దాలుగా తల్లి దాచి పెడుతున్న బాక్స్ గుర్తొచ్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

అందులో ఆమె ఏదో విలువైన వస్తువే దాచి పెట్టి ఉండొచ్చని భావించాడు. ఫ్రీజర్ వద్దకు వెళ్లి అందులో తల్లి దాచి పెట్టిన బాక్సును ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న దాన్ని చూసి స్మిత్ షాకయ్యాడు. బాక్సులో అతడికి మృతశిశువు కనిపించింది. ఆ శిశువుకు ఇప్పటికీ చర్మం, జుట్టు ప్రతిదీ అలాగే ఉన్నాయి. దాన్ని చూసిన స్మిత్‌కు కొద్దిసేపు ఏమీ తోచలేదు. ఆ తరువాత తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. స్మిత్ సమాచారంతో అక్కడికి చేరుకున్న సెయింట్ లూయిస్ పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చివరిరోజుల్లో మంచంపై ఉన్న కూడా తల్లి తనతో బాక్సులో ఉన్నదాని గురించి ఏమీ చెప్పలేదని స్మిత్ పోలీసులతో తెలిపాడు. ఒకవేళ ఈ విషయం బటపడితే తాను ప్రమాదంలో పడతానని భయపడి తన తల్లి ఇలా చేసి ఉండొచ్చని స్మిత్ పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తన తల్లి ఇన్నాళ్లు ఎంతో భద్రంగా దాచిపెడుతున్న ఆ బాక్సులో ఏదో విలువైన వస్తువు ఉంటుందని అనుకుంటే ఇలా మృతశిశువు కనిపించడంతో స్మిత్ నిరాశకు గురయ్యాడు. ఇదిలా ఉంటే ఆ శిశువు ఏవరిది.. ఎందుకు తన తల్లి గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని దాచి పెట్టిందనే విషయాలు ఇప్పుడు స్మిత్‌కు మిస్టరీగా మారాయి. ఎందుకు దాచిపెట్టిందో, ఆ మృత శిశువు ఎవరిదో ఆమెకే తెలియాలి. పోలీసులు విచారిస్తున్నారు.