భార్యకి విడాకులిచ్చి బొమ్మతో కాపురం చేస్తున్నాడు.. చివరికి ఏమైందంటే ?

125

ప్రేమ అనేది ఒక మధురానుభూతి.నచ్చినవారు కోసం ఏమి చేయడానికైనా ప్రేమికులు ఎప్పుడు రెడీగా ఉంటారు.అయితే ప్రేమ ముదిరితే పిచ్చిలాగా అవుతుందని అందరు చెప్పే నిజం.ఇప్పుడు నేను చెప్పేది వింటే ప్రేమ నిజంగానే పిచ్చిదయిందని అంటారు.అదేమిటి అంటారా..బొమ్మకు ఒక మనిషికి ప్రేమ పుట్టింది.ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.అందుకే దీనిని ప్రేమ అనడం కన్నా పిచ్చి ప్రేమ అనడం బెటర్.జపాన్ లో మనుషుల మీద విరక్తి పుట్టిన వాళ్ళ కోసం మనుషుల వలె ఉన్న బొమ్మలను తయారుచేస్తున్నారు.అయితే అలా తయారుచేసిన ఒక బొమ్మతోనే ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for lovers

ఆయన పేరు సెంజీ నకాజిమ .జపాన్ దేశీయుడు . వయసు 60+. భార్య సహచర్యం లో నిరంతరం ఆనందంగా ఉండాలని చిన్న అభిలాష . ఆయనకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఆయన మనసు అర్థం చేసుకోలేకపోయింది ఆయన అర్దాంగి . స్త్రీ స్వేచ్ఛ , సమానత్వం అంటూ గొడవపెట్టుకుని , తనకు కావాలసింది తాను తీసుకుని నకాజిమకు విడాకులు ఇచ్చేసింది . దానితో అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగినప్పటికీ , భార్యతో ఆనందంగా కలకాలం జీవించాలన్న అతని తపన తీరలేదు. వేరేవారి ని మళ్ళీ పెండ్లి చేసుకుందాం అంటే , స్త్రీ స్వేచ్ఛ,హక్కులు,భరణాలు అనే తల నెప్పులు కొనితెచ్చుకోవడానికి ఆయన గారి మనసు అంగీకరించలేదు.మరి ఏమి చేయాలి అనుకునే తరుణం లో ఒక కంపెనీ ప్రకటన అతనిని ఆకర్షించింది. ఆ కంపెనీ ఏమిటంటే “సెక్సీ బొమ్మలు” తయారు చేసే కంపెనీ. అనివార్య కారణాల స్త్రీ లతో సహజీవనం చేయలేని దురదృష్ట వంతులైన మగవారికి సేఫ్ సెక్స్ పీలింగ్ కోసం “సెక్సీ బొమ్మలు ” తయారు చేస్తుంటారు ఆ కంపెనీ వారు.

Image result for lovers

వారు తయారు చేసే బొమ్మలు ఎలా ఉంటాయంటే , ఒక్క జీవం తప్పా నూటికి నూటికి నూరుపాళ్లు అందమైన అమ్మాయిల మాదిరే ఉంటాయట. ఆ బొమ్మను తాకితే అచ్చం అమ్మాయిని తాకిన పీలింగేనట. ఆ ప్రకటన చూసిన నకాజిమ ఎగిరి గంతేసి వెంటనే పోయి ఒక బొమ్మను కొనుక్కు వచ్చి ఆ బొమ్మ తో సహజీవనం మొదలు పెట్టాడు.నకాజిమ గారు కేవలం సెక్స్ కోసమే ఆ బొమ్మను ఇంటికి తీసుకు వచ్చాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే .తన భార్య పట్ల ఎలాంటి అనురాగం చూపేవాడో ,ఆ విడాకులు తీసుకున్న భార్యకు మాత్రమే తెలుసు. కానీ ఈ బొమ్మ భార్య పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు చుపిస్తున్నాడు అనేది లోకానికి తెలిసిపోయింది. బొమ్మ భార్యకు అనురాగం పంచుతున్న అతని తీరు చూసి , అతనిని విడిచి పెట్టిన సజీవ భార్య ఎంత దురదృష్ట వంతురాలో అని జపనీయులు అనుకుంటున్నారట. అప్కోర్స్ ఇది జపాన్ లో జరుగుతున్న ఉదంతం కావచ్చు రేపు ఇండియా లోని మగవాళ్ళు ఈ పద్దతికి అలవాటు పడవచ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎందుకంటే భర్తల మీద పెరిగిపోతున్న తప్పుడు కేసుల పుణ్యమాని స్త్రీ జాతి అంటేనే విరక్తి చెందుతున్న పురుషులు నానాటికి అవుతున్నారు.”మగాళ్లు అంటే స్త్రీ జాతిని హింసించే వారు. కుటుంబాలు అంటే స్త్రీలను కాల్చుకు తినేవే ” అనే విషబీజాలు ఆధునిక స్త్రీలలో చొప్పిస్తున్న తప్పుడు భావజాలాలు వలన చివరకు బొమ్మల కంపెనీలకు లాభం ఉంటే ఉండవచ్చునేమో కానీ, స్త్రీ లకు ఒరిగేదేమి లేదు. సహజ ఆనందాలు కోల్పోవడం తప్పా. భార్యాభర్తలు మధ్య ఉండాలసింది ప్రేమానురాగాలే తప్పా హక్కులు , ఆస్టి పంపకాలు కావు అని సతీ పతులు తెలుసుకుంటే “బొమ్మలతో సహచర్యం చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉండవు కదా?ఆ పరిస్థితి భారత దేశానికి రాకూడదని మనసారా కోరుకుంటున్నాను.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భార్యకు దూరమైన వారి కోసం ఆ కంపెనీ వాళ్ళు తయారుచేస్తున్న బొమ్మల గురించి అలాగే భార్యకు దూరమై బొమ్మను భార్యగా అనుకుని సహజీవనం చేస్తున్న ఈ నకజిమ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.