హిజ్రా అని తెలియక పెళ్లి చేశారు…ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్..

269

దేవుడు పుట్టించిన మనుషుల మధ్య తేడాలను కనిపెట్టింది అదే మనిషి. నువ్వు ఆడ, నువ్వు మగ అని డిసైడ్ చేసుకొని బ్రతికేస్తున్నాం. మన దగ్గర హిజ్రాలకు మాత్రం అస్సలు విలువలేదు. కానీ ఈ స్టోరీ చదివిన తర్వాత మాత్రం హిజ్రాలు అంటే గౌరవం పెరుగుతుంది. ఓ హిజ్రా చూపిన మానవతను ఖచ్చితంగా అందరం స్వాగతించాలి.ఒక హిజ్రా తన మరదలి కోసం తన జీవితాన్నే త్యాగం చేసి మగతనం లేకపోయినా నిజమైన మగాడు అని అనిపించుకున్నాడు.మరి ఆ హిజ్రా కథ ఏమిటో తెలుసుకుందామా.

Image result for Hijra mariges

అందరు తండ్రుల లాగే ఒక వ్యక్తి తన చెల్లెలు కూతురిని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చెయ్యలని ఎన్నో కలలు కన్నాడు.ఆ బావా మరదళ్ళు కూడా అలాగే పెరిగారు.ఒకరంటే ఒకరికిక్ చాలా ఇష్టం.అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు.అయితే అబ్బాయి తనకు వయస్సు వస్తున్నా,తన శరీరంలో మార్పులు రాకపోవడాన్ని గమనించాడు. తన వయస్సు ఉన్న అబ్బాయిల ప్రవర్తనకు తన ప్రవర్తనకు చాలా తేడా ఉండడాన్ని గమనించాడు. తీరా తనకు తెలిసిందేంటంటే తను ఓ హిజ్రా.! ఈ విషయాన్ని బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక నరకయాతన పడుతున్నాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాడు కానీ వాళ్లది అసలే సాంప్రదాయ కుటుంబం.చెప్తే పరువు పోతుందని తనలోనే దాచుకున్నాడు.అలా కొంతకాలం అయ్యాకా పెళ్లీడు వచ్చింది.దాంతో ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు.వద్దు అని చెప్పాలనుకున్నా చెప్పలేని స్థితిలో ఉన్నాడు.

Image result for Hijra mariges

పెద్దలు మూహుర్తం కుదిరించారు.అప్పటికి చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాడు.చెప్పాలి… చెప్పాలి…అనుకునే లోపే ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం ఆ అమ్మాయితో ఇతని పెళ్లి జరిగిపోయింది. అందరు కలిసి శోభనం ఏర్పాటు చేశారు.ఫస్ట్ నైట్ తన విషయాన్ని భార్యకు చెప్పలేక, ఆ రాత్రిని మేనేజ్ చేయలేక చాలా ఇబ్బందిపడ్డాడు అతను.చివరకు ఓ రోజు తన భార్యను, తల్లిదండ్రులను కూర్చొబెట్టి తన పరిస్థితిని వివరించాడు. తాను సంసారానికి పనికిరానని క్లియర్ గా చెప్పాడు. తన భార్యకు వేరే పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు చెప్పి..ఇంట్లోంచి బయటికొచ్చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎటు వెళుతున్నాడో అతనికే తెలియదు. కానీ చివరకు తనలా ఉన్న వారి చెంతకు చేరాడు. ఇప్పుడు అతను అక్కడ అసలైన ఆనందం పొందుతున్నాడు.ఎవరు ఏం అనుకుంటారో అన్న భయంలేకుండా తనకు తోచినట్టుగా ఉంటున్నాడు.

Image result for Hijra mariges

చాలా మంది గృహ ప్రవేశాలకు, పుట్టిన రోజు వేడుకలకు, పెళ్ళి రోజు వేడుకలకు హిజ్రాలు వచ్చి నృత్యాలు చేస్తే శుభం జరుగుతుందని భావిస్తారు…ఈ క్రమంలో వీరికి బాగా డిమాండ్ ఉండేది. దీంతో ఈ కుర్రాడు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచిగానే డబ్బు సంపాదిస్తున్నాడు.ఇలా ఆనందంగా గడుపుతున్నాడు అంటే మళ్ళి మరొక సమస్య వచ్చింది.ఓ రోజు సడెన్ గా అతను ఉంటున్న గది డోర్ ధడ్ ,ధడ్ అంటూ చప్పుడైంది. ఎవరా? అని తెరిచి చూసేవరకు…చంకలో చిన్న పిల్లాడితో తన భార్య.! ఎంటా? అని ఆరాతీశాడు. నువ్వు వచ్చాక అత్తామామ నన్ను ఒకతనికి ఇచ్చి పెళ్లిచేశారు. వాడి పచ్చితాగుబోతుగా మారాడు. ప్రతిరోజు గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. వేశ్యల చుట్టూ తిరుగుతున్నాడు. నన్ను, అతని వల్ల కలిగిన ఈ పిల్లాడిని కూడా సరిగ్గా చూసుకోట్లేదని తన బాధనంతా వెల్లబోసుకుంది అతని ముందు.ఆమె అలా చెప్పగానే అ హిజ్రా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమెను ఆ రోజు రాత్రి తన గదిలో ఉంచుకొని ఉదయాన్నే ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ను కిరాయికి తీసుకొని అందులో ఉంచాడు. అతనికి విడాకులు ఇచ్చేయ్ అని చెప్పాడు.దానికి ఆమె ఒప్పుకుంది.దగ్గర ఉండి మరీ విడాకులు ఇప్పించాడు.ఇక ఆ తర్వాత అతడి వల్ల కలిగిన కొడుకును తన సొంత కొడుకుగా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంటి ఖర్చు, పిల్లాడి చదువు కొరకు ప్రతి నెల 20 వేల రూపాయలు.. ఆమెకు ఇస్తున్నాడు. అలా చదివిన ఆ పిల్లాడు ఎంబీఏ పూర్తి చేసుకొని ఓ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇటీవలే అతనికి పెళ్లి కూడా అయ్యింది.లవ్ మ్యారేజ్…ఆ పెళ్లిని కూడా హిజ్రాగా మారిన వ్యక్తే దగ్గరుండి మరీ తన ఖర్చులతో జరిపించాడు.ఇప్పుడు చెప్పండి…అసలైన హిజ్రాలు ఎవరు? పెళ్లి చేసుకొని పెళ్లాన్ని సరిగ్గా చూడని వాడా? పెళ్లాం ఉండగానే…ఇతర అమ్మాయిలతో కులికేవాడా?మీరేమంటారు.ఈ హిజ్రా కథ గురించి ఇతను మరదలి కోసం చేసిన త్యాగం గురించి అలాగే హిజ్రలను నీచంగా చూసే మనుషుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.