రాత్రికి ఇంటికి రమ్మని పిలిచి ఎంత నీచమైన పని చేసాడో మీరే చూడండి

510

బడి పంతులు అంటే అందరికి లోకువే.బతకలేక బడి పంతులు అంటారు.అయితే ఈ మధ్య టీచర్స్ కు కొంచెం వాల్యూ వచ్చిందిలెండి.వారికి కూడా మంచి జీతాలు ఇస్తూ వారు కూడా సంపాదించుకునే స్థితికి వచ్చారు.అయితే ఇక్కడ టీచర్స్ ను కూడా కొందరు విమర్శిస్తూ ఉంటారు.గవర్నమెంట్ టీచర్స్ అంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని అర్థం.ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ ఉద్యోగం సంపాదిస్తారు.అయితే అలాంటి వారిని కూడా నిందించేవాళ్ళు కొందరు ఉన్నారు.అలా నిందించే వాళ్లందరికీ బుద్ధి వచ్చేలా ఒక ప్రభుత్వ టీచర్ ఒక లెటర్ రాశాడు.మరి ఆయన రాసిన ఆ లెటర్ లో ఏముందో చూద్దామా.

Image result for school children images

అందరికీ నమస్కారాలు, నేను ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడిని..ఈ రోజు నాలోని ఆవేదనను ఈ ఉత్తరం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నారు. ఈ మధ్య ఫేస్ బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారీ ఉపాద్యాయులను కించపరుస్తూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి.. అవేంటంటే.. గవర్నమెంట్ టీచర్స్ గా పనిచేస్తూ,,వేలకువేలు జీతాలు తీసుకుంటూ , పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పరు..రిజల్ట్స్ లో కూడా చాలా వెనుకబడి ఉంటారు. వీళ్లకు జీతాలే దండగ, ఓసారి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ను చూసి బుద్ది తెచ్చుకోండి. మీతో పోల్చితే వాళ్లు చాలా బెటర్.. ఇలాంటి పోస్టులు నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ ప్రశ్నను లేవనెత్తిన వారికి, దానికి సపోర్ట్ గా లైక్స్, కామెంట్స్, షేర్స్ చేస్తున్న వారికి నాదొక చిన్న విన్నపం.దీనిపై నా వర్షన్ మీకు వినిపిస్తా…తర్వాత మీరే బేరీజు వేసుకోండి…మా పట్ల మీ మాటలు సరైనవా? కాదా? అని.

Image result for school children images

రోజుకి 10-15 గంటలు కష్టపడి విపరీతమైన పోటీలో ఆంద్రా సివిల్స్ గా పిలవబడే D.S.C లో ఎంపికయ్యాం..మాకు టీచింగ్ వృత్తికాదు ఫ్యాషన్.అసలు గవర్నమెంట్ స్కూల్ లో ప్రైవేట్ స్కూల్ లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? గవర్నమెంట్ టీచర్స్ కి టెలికాన్ఫరెన్స్ , వీడియోకాన్ఫరెన్స్ ,స్కూల్ కాంప్లెక్స్ మీటింగు , D.E.O మీటింగు , ఎయిడ్స్ ట్రైనింగ్ , పిల్లలడ్రెస్ , పాఠ్యపుస్తకాలు తేవడానికి ఒకరు ,ట్రెజరీ బిల్స్ చెయ్యడానికి మరొకరు , సైన్స్ ఫెయిర్ , ట్రైనింగులు ,మధ్యాహ్న భోజనము వంటివన్నీ చెయ్యమని చెప్పి విద్యాబోధన జరగకుండ చేసేది ఎవరు ?ఈ మధ్యే ఇంకొకటి మొదలుపెట్టారు స్టాఫ్ అందరి డిటైల్స్ అర్జంటుగా పంపండి.స్టూడెంట్ డీటెయిల్స్ అర్జంటు,మార్క్స్ అర్జంటు ఎన్నిసార్లు పంపినా అవన్నీ అవతల పడేసి మళ్ళీ అర్జంటుగా పంపండి అని అడుగుతారు..అర్జంటుగా వాళ్ళడిగినవి ప్రిపేర్ చేస్తుండగా,,పిల్లలు కొట్టుకోవడమో తిట్టుకొవడమో చేస్తారు..మళ్ళీ దానికి బాధ్యులు టీచర్సే..అప్పుడు సస్పెండ్ చెయ్యడానికి అధికారులు అర్జంటుగా వచ్చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పిల్లవాడు బడిలో చేరేసరికి వాడికి ఆధార్ నంబర్ ఉండదు ఆ పాట్లు మావే. దానికీ క్లాస్ టీచర్ నే బలి చేస్తారు,పిల్లల ఆధార్ నంబర్స్ ను D.E.O వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలి. అందుకు రాత్రి 10 , 11 అవ్వచ్చు.ఇంతలోనే 10th ,inter ,B.Ed,D.Ed examination డ్యూటీస్ వేస్తారు..ఐనా సకాలంలో సిలబస్ పూర్తిచేస్తాం,పిల్లలకి నోట్స్ ఇస్తాం, వాటిని కరెక్షన్ చేస్తాం.ప్రాజెక్టు వర్క్స్ చేయించి,పరీక్షలు పెట్టి పేపర్లుదిద్ది ఆ మార్కులు నానా రకాల రికార్డ్లలో వేస్తాం.. ఇంతేకాక T.L.M ,టీచర్ డైరీ,లెసన్ ప్లాన్ వంటివి రాయాలి.కాని ప్రైవేటు టీచర్స్ పై ఇంత వత్తిడి ఉండదు. వాళ్ళు జస్ట్ లెసన్ చెప్పి వెళ్ళిపోతారు.. పిల్లలకు ప్రింటింగ్ మెటీరియల్స్ ఇస్తారు.పిల్లల్ని చదివించడానికి ట్యూటర్స్ ఉంటారు..క్లాస్ ఇన్చార్జీస్ అకడమిక్ ఇంఛార్జార్ ఉంటారు..పిల్లలకు ఎక్సామ్స్ పెట్టేది ఒకరు , వాటిని దిద్దేది మరొకరు , ఆ మార్క్స్ రికార్డ్స్ లో వేసేది మరొకరు. కాని ఇక్కడ అవన్నీ మేమే చేసుకోవాలి..ఇవన్నీ చాలవన్నట్టు ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే గవర్నమెంట్ టీచర్ కావాలి.ఖచ్చితమైన జనాభాలెక్కలు కావాలంటే గవర్నమెంట్ టీచర్ కావాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రైవేట్ టీచర్ కి ఇచ్చిన స్వేఛ్ఛ మాకిచ్చి చూడండి,గవర్నమెంట్ లో సీటు కావాలంటే M.L.A నో M.P నో రికమండ్ చేసే స్తాయికి గవర్నమెంట్ ని తీసుకువెళ్తాము. చట్టాల బలంతో ప్రజలు, అధికార బలంతో అధికారులు మాపై విరుచుకు పడుతున్నా.మాకు తెలిసిందల్లా తలదించుకుని భావి తరం తలెత్తుకుని జీవించడానికి విధ్యార్ఢి సర్వతోముఖాభివృద్ది సాధించడానికి కృషిచెయ్యడం. ఇదంతా చదివాక కూడా మమ్మల్ని విమర్శించాలని అనుకుంటే మీ ఇష్టం..అంటూ ఒక ప్రభుత్వ టీచర్ బాధతో రాసిన ఉత్తరం ఇది.వింటూనే వాళ్ళు పడుతున్న కష్టాలు ఎన్నో అని అనిపిస్తుంది కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రభుత్వ టీచర్స్ మీద అలాగే వారు ఇన్ని కష్టాలు పడుతూ చేస్తున్న పని మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.