మహాశివుడి అద్భుతం… తవ్వకాల్లో బయటపడిన నంది విశేషాలు తెలిస్తే షాక్

64

తవ్వకాలు జరిపినప్పుడు అప్పుడప్పుడు వింత వింత వస్తువులు బయటపడతాయి. కొన్నిసార్లు మనుషుల పుర్రెలు లేదా ఎన్నో వందల ఏళ్ల క్రితం నాటి వస్తువులు బయటపడతాయి. ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఎన్నో జరిగాయి కూడా. అయితే ఇప్పుడు తవ్వకాలలో ఏకంగా నంది విగ్రహాలు బయటపడ్డాయి. ఒకచోట అనుకుంటే ఏమో అనుకోవచ్చు. ఒకేసారి రెండుచోట్ల నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో చూడండి

చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో… పంచాయతీ స్థలంగా భావిస్తున్న మంచి నీటి గుంట దగ్గర్లో… కరిమారెమ్మ గుడి ఎదురుగా పంచాయతీ శాఖ సిబ్బంది తవ్వకాలు జరిపారు. ఓ పురాతన నంది విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ నందిని చిన్నప్పుడు తాము చూశామంటే తాము చూశామంటూ వాళ్లు చెబుతున్నారు. ఇంకొందరైతే… ఈ నంది దగ్గరే ఆడుకున్నామని కూడా అంటున్నారు. నంది నోటి నుంచీ నీరు సహజంగా ప్రవహించడం వల్ల తమ వీధికి బుగ్గ వీధి అనే పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు. కొంతమంది ఇది బ్రిటిష్ కాలం నాటిదని, మరి కొందరు ఇది చంద్రగిరి రాజా కాలం నాటిదని, ఇంకొందరు శ్రీకృష్ణదేవరాయలు నాటిదని చెబుతున్నారు. మరి అలాంటి నంది ఎందుకు భూమిలో కూరుకుపోయింది? చూడ్డానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తున్న ఆ నంది ఎందుకు భూగర్భంలోకి వెళ్లిపోయింది?

Related image

కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాదారుల కోరల్లో చిక్కి నంది భూస్థాపితం అయ్యిందన్నది స్థానికుల వాదన. అభివృద్ధి పనుల్లో భాగంగా పంచాయతీ సిబ్బంది… గ్రామ ప్రజల సమక్షంలో జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో నంది బయటపడింది. దాన్ని చూసి అంతా హర్షం వ్యక్తం చేశారు. రేణిగుంట పట్టణంలోని చాలా ప్రాంతాల్ని కబ్జాదారులు ఆక్రమించారనీ, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.నందిపై చర్చించిన నేతలు దాన్ని పురావస్తు శాఖ అధికారులతో పరిశీలింపజేసి… అది ఎప్పటిదో తేల్చుతామంటున్నారు. నంది ఉన్నట్లే… ఆ ప్రాంతంలో ఇతరత్రా విగ్రహాలు, శాసనాల వంటివి ఉండొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విగ్రహం పరిస్థితి ఇలా ఉంటె కర్ణాటక రాష్టం మైసూర్ దగ్గరలో గల ఒక గ్రామంలో ఎండిన ఒక సరస్సులో ఏకశిలా రాయితో చెక్కబడిన శతాబ్దం కింద నంది విగ్రహలు బయటపడింది. ఇక్కడ ఒకప్పుడు సనాతన దర్మం విరాజిల్లింది. ఈ విగ్రహం ఆ కాలంనాటివే అయ్యి ఉంటాయి. వీటిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇలాంటి నందిని ఎక్కడ చూడలేదని, నిజంగా ఇది ఒక మంచి తరుణమని భావిస్తున్నారు. ఇది ఏ కాలానిదో తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.