బీఎండబ్లూ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన తండ్రి మొదటిరోజే నదిలోకి తోసేసిన కుమారుడు ఎందుకంటే

64

కోపం ఎంతటి అనర్థాన్నయినా సృష్టిస్తుంది. ఈ కోపం కారణంగా ఎన్నో కోల్పోతారు చాలామంది. అందుకే మనిషి కోపాన్ని ముందు ఎదిరిస్తే జీవితంలో దేన్ని అయినా సులువుగా సాధిస్తాడు, కాని మనకు వచ్చే కోపం తగ్గుతుందా? తగ్గదు.. మనకు నచ్చని పనిచేస్తే అవతల వారిపై మన కోపతాపాలు ప్రదర్శిస్తాం, తప్పు ఎందుకు జరిగింది ,ఎలా జరిగింది, అసలు దానికి కారణం ఏమిటి ఇవేమీ ఆలోచించం, చెడామడా తిట్టేస్తాం. మరి ఇలాంటి కోపాన్ని ప్రదర్శించాడు ఓ యువకుడు. కాకపోతే తన కోపాన్ని బీఎండబ్ల్యు కారుపై చూపించాడు. తనకు నచ్చిన బ్రాండ్‌ కారు కొనివ్వలేదని రూ. 35 లక్షలకు పైగా విలువ చేసే కొత్త బీఎండబ్ల్యు కారును నదిలోకి తోసేశాడు. మరి అతగాడి ఈ వింత కోపం కథ తెలుసుకుందాం.

Image result for bmw car

అవును అసలు బీఎండబ్లూ అని వినగానే రిచ్ కిడ్ అనుకునే ఉంటారుమీరు అనుకున్నది వందికి వంద శాతం నిజం 35 లక్షల రూపాయల కారు నదిలోకి వదిలాడు అంటే అతనికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో అని ఆశ్చర్యపోయి ఉంటారు మరి అతడి వివరాలను చూస్తే… హరియాణా రాష్ట్రంలో యమునానగర్‌కు చెందిన ఓ భూస్వామి కుమారుడు తనకు ఎంతో ఇష్టమైన జాగ్వర్‌ కారు కొనివ్వాలని తండ్రిని అడిగాడు. కానీ వారు అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యు కారును తీసిచ్చారు. ఆ కారు తనకు వద్దని చెప్పినా పట్టించుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆ కారులో వెళ్లి సమీపంలోని నదిలోకి తోసేశాడు. నదీ ప్రవాహానికి అది అలా కొట్టుకుపోతుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అతడు చేసిన పనికి ఆశ్చర్యపోయి చూస్తూ వున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆ తర్వాత అతడి కోపం చల్లారాక గజ ఈతగాళ్లను పిలిపించి మళ్లీ కారును ఒడ్డుకు లాక్కుని వచ్చాడు. ఈ వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. విషయం పోలీసులకు తెలియడంతో యువకుడుని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ముందు కోపంలో ఈ కారు నదిలోకి వదిలేస్తే జాగ్వారు కారు కొనిస్తారు అని అనుకున్నాడు, కాని తర్వాత అనవసరంగా 35 లక్షల రూపాయల కారు మనం వాడకపోతే మా నాన్న అయినా వాడుకుంటాడు కదా అని రియలైజ్ అయ్యాడు అందుకే గజ ఈతగాళ్లను పిలిచి కారు బయటకు తీయించాడు దీనికి మరో 2 లక్షలు ఇచ్చాడు, ఆ కారు వర్క్ చేయించడానికి మరో 7 లక్షలు అవుతుంది అని సర్వీస్ సెంటర్ వారు చెప్పారట. అయితే కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నవాడు తెలియక చేశాడు వదిలెయ్యండి అని ఆ బాబుని ఇంటికి తీసుకువెళ్లారట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ,ఆ తండ్రి నీకు ఇక ఎలాంటి కారు ఇవ్వను, బైక్ కొనిస్తాను తీసుకుంటే తీసుకో లేకపోతే మానెయ్ అని చెప్పాడట. మరి తండ్రి సెకండ్ టైమ్ తీసుకున్న డెసిషన్ పై మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి.