Breaking News:ప్రియురాలితో దొంగచాటుగా పెళ్ళిచేసుకున్న టాలీవుడ్ విలన్.. ఫోటోస్ లీక్

331

సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీల ఎఫైర్స్ గురించి రోజుకోకవార్త బయటకు వస్తుంది.ఎప్పుడు ఎవరికీ పెళ్లి అవుతుందో ఎప్పుడు పెడాకులు అవుతుందో ఊహించలేము.కొందరు సినిమా తారలు రహస్య వివాహాలు చేసుకోవడం సర్వసాధారణం.మీడియాకు తెలియకుండా సినీ పరిశ్రమల వారికీ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు.మలయాళ హీరో దిలీప్ , హీరోయిన్ కావ్యా మాధవన్ లు హీరోయిన్ కామ్న జఠ్మలానీ అలాగే ఈ మధ్య పెళ్లి చేసుకున్న శ్రియ కూడా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు ఈ కోవలోకి మరొక నటుడు ఎంటరయ్యాడు.ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.మరి ఆ నటుడు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో చూద్దామా.

సౌత్ యాక్టర్ హరీష్ ఉత్తమన్ తన ప్రియురాలు అమృత కళ్యాణ్‌పూర్‌‌ను పెళ్లాడారు. నవంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం రహస్యంగా కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోస్ లీక్ అయ్యాయి. కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో నవంబర్ 6న వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి ప్రైవేట్ ఈవెంటుగా జరిగిన ఈ వేడుకకు హరీష్, అమృత కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.హరీష్ ఉత్తమన్ పెళ్లి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత కళ్యాణ్‌పూర్‌, హరీష్ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇరుకుంటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తన పెళ్లి విషయాన్ని హరీష్ ఇప్పటి వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. హరీష్ ఉత్తమన్ సినిమాల్లోకి రాకముందు పారమౌంట్ ఎయిర్ వేస్, బ్రిటిష్ ఏయిర్ వేస్‌లో క్యాబిన్ క్రూ జాబ్ చేశారు. తర్వాత చెన్నైలో కూడా కొన్ని ఉద్యోగాలు చేశారు. 2010లో ‘థా’ అనే తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో గౌరవం, పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణ గాడి వీర ప్రేమగాధ, మిస్టర్, దువ్వాడ జగన్నాధమ్, జై లవ కుశ, నా పేరు సూర్య చిత్రాల్లో హరీష్ ఉత్తమన్ నటించారు.చూశారుగా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ విలన్ ఉత్తమన్ గురించి.